తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (సెప్టెంబరు 5 - 11)

ఈ వారం (సెప్టెంబరు 5 - 11) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

Weekly Horoscope
ఈ వారం రాశిఫలం

By

Published : Sep 5, 2021, 4:29 AM IST

Updated : Sep 5, 2021, 5:32 AM IST

ఈ వారం (సెప్టెంబరు 5 - 11) రాశిఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి చెప్పిన సంగతులు మీకోసం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం)

బుద్ధిబలంతో లక్ష్యం సిద్ధిస్తుంది. సమయానికి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో అపార్థాలకు అవకాశముంది. పూర్వపుణ్యంతో ఒక సమస్య నుండి బయటపడతారు. ఆపదలు తొలగుతాయి. కుటుంబసభ్యుల సలహా అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆంజనేయస్వామిని ప్రార్థించండి, కార్యసిద్ధి ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

మనోబలంతో పనిచేయండి. సొంత నిర్ణయం లక్ష్యాన్ని చేరుస్తుంది. ఉద్యోగంలో శ్రమ ఫలిస్తుంది. నూతన ప్రయత్నాలు లాభిస్తాయి. ఒక మెట్టు దిగి మాట్లాడండి. అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రచించండి. ఆర్థికస్థితి అనుకూలిస్తుంది. వ్యాపారంలో కలిసివస్తుంది. తెలియని విషయాల్లో తలదూర్చవద్దు. శివధ్యానం మంచిది.

మిథునం (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

అద్భుతమైన శుభకాలం నడుస్తోంది. సర్వ కార్యసిద్ధి సూచితం. కోరికలు నెరవేరతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఉత్తమస్థితి గోచరిస్తోంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. మంచి పనులను ప్రారంభించండి. అవే గొప్ప భవిష్యత్తునిఇస్తాయి. వ్యాపారబలం పెరుగుతుంది. సమస్యలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దుర్గాస్తుతి ఉత్తమం.

కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష)

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ముందడుగు వేయండి. అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒత్తిడికి గురిచేసే పరిస్థితులు ఎదురవుతాయి. బంధుమిత్రుల అండ అవసరం. ఉద్యోగ వ్యాపారాలు మిశ్రమ ఫలితాన్నిస్తాయి. శాంతంగా ఉండాలి. వృధా ప్రయాణాలు శ్రమ కలిగిస్తాయి. సూర్యస్తుతి మేలుచేస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

అంతా మంచే జరుగుతుంది. కోరుకున్న ఆశయం నెరవేరుతుంది. మీవల్ల కొందరు ఉపకారం పొందుతారు. ఉద్యోగంలో ఉన్నత మైన ఫలితం గోచరిస్తోంది. అధికారుల అండ పెరుగుతుంది. వ్యాపారలాభం ఉంది. ఆర్థిక వృద్ధి సూచితం. ఇప్పుడు తీసుకునే నిర్ణయం మంచి భవిష్యత్తునిఇస్తుంది. ఇష్టదైవాన్ని ధ్యానించండి.

కన్య (ఉత్తర 2,3,4 పాదాలు; హస్త, చిత్త 1,2 పాదాలు)

ప్రశాంతత లభిస్తుంది. మానసిక దృఢత్వంతో ఉత్తమ కార్యసిద్ధి పొందుతారు. అడ్డంకులు తొలగి, శుభఫలితాలు వస్తాయి. స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. గందరగోళ పరిస్థితి ఒకటి ఏర్పడుతుంది. దగ్గరివారి సలహా అవసరం, సమష్టి కృషి ఫలిస్తుంది. నూతన అవకాశాలు వస్తాయి. మంచివార్త వింటారు. విష్ణుదర్శనం శుభప్రదం.

తుల (చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)

ఉద్యోగంలో ప్రయత్న పూర్వక విజయాలు ఉన్నాయి. ధర్మచింతనతో పని మొదలు పెట్టండి. అన్నివిధాలా శుభం జరుగుతుంది. అధికారులను ప్రతిభతో మెప్పిస్తారు. పదవీ లాభం సూచితం. ఇప్పుడు తీసుకునే నిర్ణయం బంగారు భవిష్యత్తునిస్తుంది. ధనలాభం కలుగుతుంది. నమ్మకంగా ముందుకు సాగండి. ఇష్టదేవతాస్మరణతో లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.

వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ)

ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. అధికారుల ప్రశంసలు లభిస్తాయి. సుస్థిరత ఏర్పడుతుంది. వ్యాపార విజయముంటుంది. ఉన్నతమైన అవకాశాలు వస్తాయి. తగినంత మానవ ప్రయత్నం చేయాలి. ధనధాన్య లాభాలు ఉంటాయి. గృహ-వాహన ప్రాప్తి ఆనందాన్నిస్తుంది. ఇంట్లో శుభం జరుగుతుంది. ఇష్టదేవతా దర్శనం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

కాలం వ్యతిరేకంగా ఉంది. ప్రతి పనీ ఆలోచించి చేయండి. పొరపాటు జరిగితే నష్టం ఎక్కువ. కుటుంబసభ్యుల మాట వినండి. కొన్ని నిర్ణయాలు ఇబ్బంది పెట్టొచ్చు. కొందరివల్ల సమస్య ఎదురవుతుంది. సున్నితమైన అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. నవగ్రహ శ్లోకాలు చదివితే మనశ్శాంతి లభిస్తుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు)

అదృష్టవంతులవుతారు. పనులు వాయిదా వేయవద్దు. ఒత్తిడి కల్గించే పరిస్థితులున్నా గతానుభవంతో నిర్ణయం తీసుకోండి. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. దివ్యమైన ఫలితం సిద్ధిస్తుంది. కలహాలకు అవకాశమివ్వవద్దు. ఆస్తిని వృద్ధి చేసే పనిలో నిమగ్నం కావాలి. భవిష్యత్తు బాగుంటుంది. లక్ష్మీ ఆరాధన మంచిది.

కుంభం (ధనిష్ట 3,4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

మనోబలంతో లక్ష్యాన్ని చేరతారు. ఉద్యోగంలో శ్రద్ధ పెంచితే ఆశించిన ప్రతిఫలం అందుతుంది. దైవానుగ్రహంతో ఒక పని పూర్తిచేస్తారు. సొంత నిర్ణయం విజయాన్నిస్తుంది. శత్రువులు మిత్రులవుతారు. పోయినవి తిరిగి లభిస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణతో మనోబలం పెరుగుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆత్మవిశ్వాసంతో పని ప్రారంభించండి. విజయం వెంటనే లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసివస్తుంది. కోరుకున్న జీవితం లభిస్తుంది. ఒక కల సాకారమవుతుంది. మధ్యలో ఎదురయ్యే ఆటంకాలను బుద్ధి చతురతతో అధిగమించండి. లక్ష్యం సిద్ధించేవరకు శ్రమించాలి. శాంత స్వభావం మీ గౌరవాన్ని మరింతగా పెంచుతుంది. లక్ష్మీ ఆరాధన శ్రేష్ఠం.

Last Updated : Sep 5, 2021, 5:32 AM IST

ABOUT THE AUTHOR

...view details