తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం రాశిఫలం (ఏప్రిల్03 - ఏప్రిల్09)

Weekly Horoscope: ఈ వారం (ఏప్రిల్03 - ఏప్రిల్09) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

Weekly Horoscope
ఈ వారం రాశిఫలాలు

By

Published : Apr 3, 2022, 5:12 AM IST

Weekly Horoscope: ఈ వారం (ఏప్రిల్03 - ఏప్రిల్09) మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే..

అదృష్టవంతులవుతారు. ఉద్యోగపరంగా ఉత్తమ ఫలితముంటుంది. పెద్దలతో చర్చిస్తే కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. మేలుచేసే పనులు చేపడతారు. విఘ్నాలు తొలగుతాయి. వ్యాపారం కలిసి వస్తుంది. ఉత్సాహం పెరుగుతుంది. సహనం అవసరం. ధనలాభం సూచితం. నూతనాంశాలను తెలుసుకుంటారు. సూర్యదర్శనం శుభప్రదం.

ముఖ్య కార్యాల్లో శీఘ్ర విజయముంటుంది. స్వయంకృషితో పైకి వస్తారు. ధైర్యంగా ముందడుగు వేయండి. ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. అనేక మార్గాల్లో లాభపడతారు. కొందరివల్ల విఘ్నాలు ఎదురవుతాయి. తెలివిగా తప్పించుకోవాలి. సమయపాలన అవసరం. వేంకటేశ్వరస్వామిని స్మరిస్తే మంచిది.

విశిష్టమైన శుభయోగముంది. దైవానుగ్రహం లభిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. సుస్థిరత వస్తుంది. భవిష్యత్తుకు అవసరమైన పనులను ప్రారంభించండి. వ్యాపారపరంగా లాభాలుంటాయి. కొన్ని అవాంతరాల నుండి బయటపడతారు. ఓర్పు చాలా అవసరం. తడబాటులేకుండా మాట్లాడండి. ఇష్టదైవాన్ని ధ్యానించండి, కుటుంబపరంగా శాంతి లభిస్తుంది.

పనిలో నైపుణ్యం పెరుగుతుంది. ముందస్తు ప్రణాళికలతో లాభపడతారు. వృత్తిలో పేరు వస్తుంది. శ్రమ ఎదురైనా ఫలితం బాగుంటుంది. పట్టుదలతో ఒక మెట్టు పైకి ఎక్కుతారు. భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసేందుకు మంచి కాలమిది. ధనలాభం ఉంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. విష్ణుమూర్తిని స్మరించండి, శాంతి పెరుగుతుంది.

ఉద్యోగంలో విజయం సాధిస్తారు. ప్రతి విషయంలోనూ శ్రద్ధ అవసరం. సరైన దిశానిర్దేశంతో సమాజంలో గొప్ప కీర్తి పొందుతారు. స్థిర బుద్ధితో ప్రణాళికను తయారు చేయండి. కొన్ని పనులు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారంలో మెలకువలు అవసరం.ధనం వృద్ధి చెందుతుంది. నూతన వస్తు లాభముంది. ఇష్టదేవతారాధన శ్రేష్ఠం.

ముఖ్యకార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. తెలియని ఆటంకాలు ఎదురవుతాయి. సరైన పద్ధతిలో పని ప్రారంభిస్తే విజయం లభిస్తుంది. కాలం వ్యతిరేకంగా ఉంది. ఉద్యోగంలో మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయండి. చెడు ఊహించవద్దు. తోటివారి సూచనలు అవసరం. దైవశక్తి సదా కాపాడుతుంది. నవగ్రహ ధ్యానం శక్తినిస్తుంది.

కాలం అన్నివిధాలా సహకరిస్తోంది. అనేక మార్గాల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రశంసలూ పురస్కారాలున్నాయి. ప్రశాంత జీవనం కొనసాగుతుంది. వ్యాపారబలం పెరుగుతుంది. ఆర్థిక లాభాలున్నాయి. తోటివారి సహకారం లభిస్తుంది. కొన్ని ఆటంకాలు తొలగుతాయి. భూ గృహ వాహనాది యోగాలుంటాయి. ఇష్టదేవతను స్మరించండి, కార్యాలు సిద్ధిస్తాయి.

మంచికాలం నడుస్తోంది. శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఎప్పటి పని అప్పుడే చేయండి. ఫలితం అద్భుతంగా ఉంటుంది. మంచి మనసుతో బంగారుమయ జీవితాన్ని పొందుతారు. వ్యాపారం అనుకూలం. బాధ్యతలు పెరుగుతాయి. ఇంట్లో శుభం జరుగుతుంది. ఎదురుచూస్తున్న పని ఒకటి పూర్తి అవుతుంది. సూర్యపూజ శుభప్రదం.

వ్యాపారం కలిసి వస్తుంది. ధనలాభం ఉంది. ఉద్యోగంలో బాగా కష్టపడాలి. ఒత్తిడిని తట్టుకోవాలి. అవకాశాల్ని అంది పుచ్చుకోవాలి. కొన్ని విషయాల్లో స్పష్టత రాదు. వారం మధ్యలో ఒక విజయం లభిస్తుంది. సాహసాలు చేయవద్దు. కుటుంబసభ్యుల సలహాలు అవసరం. సంతోషించే ఫలితాలుంటాయి. శివారాధన ఉత్తమం.

కాలం సహకరిస్తోంది. ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. దైవానుగ్రహం ముందుకు నడిపిస్తుంది. లోపంలేకుండా కృషి చేయండి. సత్ఫలితాలుంటాయి. వ్యాపారం మిశ్రమం. ఆర్థికంగా లాభపడతారు. కుటుంబపరంగా బాధ్యత పెరుగుతుంది. ధర్మదేవత అనుగ్రహంతో శక్తి లభిస్తుంది. ఆపదలు తొలగుతాయి. దుర్గాధ్యానం శుభప్రదం.

మనోబలంతో విజయం సాధిస్తారు. ఉద్యోగరీత్యా శ్రద్ధ పెంచాలి. సహనాన్ని కోల్పోయే సందర్భాలు గోచరిస్తున్నాయి. మీ ధర్మాన్ని మీరు సకాలంలో నిర్వర్తించడం ద్వారా ఉత్తమ ఫలితాన్ని పొందుతారు. నిర్ణయాలు తీసుకోవటంలో తడబాటు రాకూడదు. మిత్రలాభముంటుంది. కొత్త ఆలోచనలు శక్తినిస్తాయి. అవాంతరాలను దాటతారు. ఆదిత్య స్తుతి ఉత్తమం.

పట్టుదలతో పనిచేస్తే తగినంత ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రశంసలుంటాయి. సంతృప్తినిచ్చే అంశముంది. పొరపాటు జరగకుండా జాగ్రత్తపడాలి. ఉత్సాహాన్నిబట్టి పనులు పూర్తవుతాయి. స్వయంకృషి లక్ష్యాన్ని చేరుస్తుంది. వ్యాపారబలాన్ని పెంచుకోవాలి. ఆర్థికస్థితి మెరుగవుతుంది. ఆపదలనుంచి బయటపడతారు. గణపతిని దర్శించండి, మంచివార్త వింటారు.

ABOUT THE AUTHOR

...view details