Weekly Horoscope: ఈ వారం (ఏప్రిల్ 24- 30) గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
ఉద్యోగంలో శుభ ఫలితముంది. ధర్మమార్గాన్ని అనుసరించాలి. ముందస్తు ప్రణాళికలతో పనిచేస్తే అభివృద్ధిని సాధిస్తారు. మనోబలం అవసరం. తొందర నిర్ణయాలు వద్దు. వ్యాపార నష్టం సూచితం. జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆవేశపరిచే సంఘటనలు చోటుచేసుకుంటాయి. వారాంతంలో లక్ష్యం నెరవేరుతుంది. సూర్యనారాయణమూర్తిని స్మరిస్తే మంచిది.
ముఖ్యకార్యాల్లో విజయముంటుంది. ఉద్యోగంలో కీర్తీ హోదా లభిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారంలో కొంత శ్రద్ధ అవసరం. మొహమాటం వల్ల సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. అపోహలు తొలగుతాయి. ధైర్యంగా సమస్యలను పరిష్కరించాలి. నవగ్రహశ్లోకాలు చదవండి, మనోబలం వస్తుంది.
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత స్థితి లభిస్తుంది. శ్రేష్ఠమైన ఫలితాలుంటాయి. నూతనాంశాలు తెలుస్తాయి. ప్రయత్నాలు సఫలమవుతాయి. కోరుకున్న జీవితం లభిస్తుంది. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. సంతృప్తికర ఫలితాలను సాధిస్తారు. వ్యాపారం చాలా బాగా కలిసి వస్తుంది. లక్ష్మీ కటాక్షసిద్ధి ఉంది. దత్తాత్రేయ ధ్యానం శుభప్రదం.
ఎటుచూసినా విజయమే గోచరిస్తోంది. సకాలంలో పని ప్రారంభించండి. మంచి జరుగుతుంది. అనుకున్నది సాధిస్తారు. నైపుణ్యం పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి ప్రోత్సాహముంటుంది. గృహ వాహనాది ప్రయత్నాలు ఫలిస్తాయి. వస్తు వస్త్రప్రాప్తి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో విశేష ఫలితాలుంటాయి. ఇష్టదైవ దర్శనం మేలుచేస్తుంది.
పట్టుదలతో పనిచేయండి. తప్పక విజయం ఉంటుంది. ఆత్మవిశ్వాసం సడలకూడదు. ధర్మచింతన విఘ్నాల నుండి రక్షిస్తుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించండి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడాలి. కొత్త ప్రయత్నాలు అంతగా ఫలించవు. కుటుంబసభ్యుల సలహాలు అవసరం. వారాంతంలో శుభం జరుగుతుంది. ఇష్టదేవతను దర్శిస్తే మంచిది.
సకాలంలో పని ప్రారంభించండి. ఉద్యోగంలో సత్ఫలితాలు ఉంటాయి. ఉత్సాహంగా సంకల్పాన్ని నెరవేర్చండి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మేలు చేసేవారున్నారు. ధన లాభముంది. చంచలత్వం వల్ల ఒత్తిడి, శ్రమ పెరుగుతాయి. రుణ సమస్యలు రానివ్వవద్దు. సమష్టి కృషి ఫలిస్తుంది. ఆదిత్యహృదయం చదవండి, మనశ్శాంతి లభిస్తుంది.