తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Weekly Horoscope From 8th To 14th October : ఆ రాశివారిపై కుట్ర జరిగే అవకాశం ఉంది.. జాగ్రత్త! - Weekly Horoscope From 8st To 14th October

Weekly Horoscope From 8th To 14th October : అక్టోబర్​ 8 నుంచి అక్టోబర్​ 14 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Weekly Horoscope From 8th To 14th October 2023
Weekly Horoscope From 8th To 14th October 2023

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2023, 5:02 AM IST

Updated : Oct 8, 2023, 8:50 AM IST

Weekly Horoscope From 8th To 14th October : అక్టోబర్​ 8 నుంచి అక్టోబర్​ 14 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

మేషం (Aries) :ఈ వారం మేష రాశివారికి చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. అయితే ఉద్యోగంలో కాస్త ఒడుదొడుకులు ఎదురవుతాయి. వ్యాపారులు మాత్రం మంచి లాభాలు పొందుతారు. అయితే జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావచ్చు. జాగ్రత్త వహించాలి. ప్రేమికులకు మాత్రం కాలం కలిసి వస్తుంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. వారంలో మొదటి మూడు రోజులు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.

వృషభం (Taurus) :ఈ వారం వృషభ రాశివారు చిన్న చిన్న ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటిని ఆధునికీకరించడానికి ప్రయత్నం చేస్తారు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఉద్యోగంలో రాణిస్తారు. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారులకు మాత్రం అనుకున్నంతగా లాభాలు రావు. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు. ప్రేమికుల మధ్య అపార్థాలు, తగాదాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది. వారం ప్రారంభంలో ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

మిథునం (Gemini) : ఈ వారం మిథున రాశివారికి కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ప్రేమికులకు చిన్న పాటి సమస్యలు ఎదురైనా.. తరువాత ఒక్కటయ్యే అవకాశం ఉంటుంది. మీకు స్నేహితుల నుంచి మద్ధతు లభిస్తుంది. వివాహితలకు గృహజీవితంలో ఒత్తిడి ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. ముఖ్యంగా వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. అనుకున్న పనులు అన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. జాగ్రత్త! వారంలో మొదటి నాలుగు రోజులు ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు కొన్ని చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

కర్కాటకం (Cancer) : ఈ వారం కర్కాటక రాశివారికి అంత అనుకూలంగా లేదు. మనస్సులో ఏదో తెలియని ఆందోళన చెలరేగుతుంది. ప్రియమైనవారు దూరం అవుతుంటే.. కన్నీళ్లు పెట్టుకుంటారు. జీవిత భాగస్వామితో అనుబంధం పెరుగుతుంది. మీ తల్లి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. అయితే మీ సోదరులు, సోదరీమణులతో మీకు తోడుగా ఉంటారు. మరోవైపు మీ ఆదాయం బాగుంటుంది. ఉద్యోగంలో రాణిస్తారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. కష్టపడి పనిచేసి.. విజయం సాధిస్తారు. అయితే మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. విద్యార్థులు మాత్రం చాలా కష్టపడి చదివితేనే.. మంచి ఫలితాలు వస్తాయి.

సింహం (Leo) :ఈ వారం సింహ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై దుష్ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి. వారం చివరిలో ప్రయాణాలు చేయడం మంచిది. ఇతరుల సాయంతో పనులను పూర్తి చేయగలుగుతారు. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. ఆదాయం బాగా పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. ప్రేమికులు శృంగార సౌఖ్యాన్ని ఆస్వాదిస్తారు. ఉద్యోగులు సమర్థవంతంగా తమ పనులను పూర్తి చేసి, సత్తా చాటుతారు. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. అయితే మనస్సు పెట్టి చదివితేనే.. మంచి ఫలితాలు వస్తాయి.

కన్య (Virgo) : ఈ వారం కన్య రాశివారికి అంతా కలిసి వస్తుంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు తమ తమ రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. బాగా డబ్బులు సంపాదిస్తారు. అయితే సరైన సమయానికి ఆహారం తీసుకోవడం అవసరం. లేదంటే అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. వివాహితులు తమ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా గడుపుతారు. ప్రేమికులు మరింత సన్నిహితంగా గడుపుతారు. ప్రత్యర్థులపై నైతికంగా విజయం సాధిస్తారు. విద్యార్థులు మాత్రం చదువులపై దృష్టి సారించాల్సి ఉంటుంది.

తుల (Libra) :ఈ వారం తుల రాశి వారికి ఏమీ బాగోలేదు. మనస్సులో తెలియని గందరగోళంగా ఉంటుంది. దీనితో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. వ్యాపారంలో ఒడుదొడుకులు ఎదురవుతాయి. కష్టపడి పనిచేసిన తగిన ఫలితాలు రావు. అయితే జీవిత భాగస్వామి సహకారం మీకు లభిస్తుంది. ఇరువురి మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. స్నేహితులు అవసరమైన సమయంలో ఆదుకుంటారు. వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు.

వృశ్చికం (Scorpio) :ఈ వారం వృశ్చిక రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా అనుకోని అదృష్టం కలిసి వస్తుంది. సుదీర్ఘ ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కానీ వీటి వల్ల మంచి ప్రయోజనం లభిస్తుంది. నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. కనుక ఆర్థికంగా లాభపడతారు. అయితే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారులు వ్యాపారంలో లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం కచ్చితంగా కనిపిస్తోంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. ప్రేమికులు పరస్పర అనురాగంతో, హాయిగా కాలం గడుపుతారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

ధనుస్సు (Sagittarius) : ఈ వారం ధనుస్సు రాశివారికి అంత అనుకూలంగా లేదు. మానసిక ఆందోళనతో బాధపడతారు. ధన నష్టం కలుగవచ్చు. అనుకున్న పనులు పూర్తి కావు. పనిలో చాలా ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగం, వ్యాపారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆరోగ్యం మాత్రం బాగుంటుంది. జీవిత భాగస్వామి మద్దతుతో ఎలాంటి కష్టనష్టాలను అయినా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఆదుకుంటారు. వారం ప్రారంభంలో మినహాయిస్తే.. మిగతా సమయం అంతా ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఫైన్​ఆర్ట్స్​, కామర్స్ విద్యార్థులు బాగా రాణిస్తారు.

మకరం (Capricorn) :ఈ వారం మకర రాశి వారికి బాగానే ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రేమికులకు అనుకూలమైన కాలం ఇది. ఉద్యోగంలో రాణిస్తారు. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. అయితే మీపై కుట్ర జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. వ్యాపారంలో రాణిస్తారు. ఆర్థికంగా లాభపడతారు. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం క్షీణించడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. జాగ్రత్త! వారం చివరిలో ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు మాత్రం కష్టపడి చదవాల్సి ఉంటుంది.

కుంభం (Aquarius) : ఈ వారం కుంభరాశివారు చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. మానసిక ఒత్తిడి జయించి.. మీపై మీరు విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.. అప్పుడే అనుకున్న పనులు అన్నీ విజయవంతం అవుతాయి. మనఃస్పూర్తిగా కృషి చేస్తే.. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది. కుంభ రాశివారు ఈ వారం వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. వివాహితుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. భార్యాభర్తలు శృంగార రసానుభూతిని పొందుతారు. ఈ వారంలోని చివరి రోజు మాత్రమే ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు మాత్రం బాగా కష్టపడితేనే.. ఉత్తీర్ణులు అవుతారు.

మీనం (Pisces) : ఈ వారం మీన రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. తరువాత అంతా సర్దుకుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. అయితే కుటుంబ సభ్యులకు తెలియకుండా కొంత సొమ్ము ఖర్చు చేస్తారు. వివాహితులు సంతోషంగా గడుపుతారు. ప్రేమికులు ఒక్కటయ్యే అవకాశం ఉంది. వారం ప్రారంభంలో ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు.

Last Updated : Oct 8, 2023, 8:50 AM IST

ABOUT THE AUTHOR

...view details