తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Weekly Horoscope From 22nd To 28th October : ఆ రాశుల వారికి వ్యాపారాల్లో లాభాలే లాభాలు! - Weekly Horoscope From 22nd To 28th October

Weekly Horoscope From 22nd To 28th October : అక్టోబర్​ 22 నుంచి అక్టోబర్​ 28 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Weekly Horoscope in telugu
Weekly Horoscope From 22nd To 28th October

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2023, 4:42 AM IST

Weekly Horoscope From 22nd To 28th October : అక్టోబర్​ 22 నుంచి అక్టోబర్​ 28 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

మేషం (Aries) :ఈ వారం మేష రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుంది. అయినా వాటిని సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. వ్యాపారంలో మాత్రం స్వల్ప లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి కూడా ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితంలో ఒడుదొడుకులు వస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు. ప్రేమికులకు మాత్రం అంతా అనుకూలంగా ఉంటుంది.

వృషభం (Taurus) :ఈ వారం వృషభ రాశివారికి అంతా బాగానే ఉంటుంది. పెండింగ్​లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఇది మీకు ఆనందాన్ని, ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది. ఉద్యోగులకు మంచి గుర్తింపు లభిస్తుంది. సీనియర్లతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయం తగ్గవచ్చు. అయితే కుటుంబ సభ్యులు అన్ని వేళలా మీకు సహకారం అందిస్తారు. వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. ప్రేమికులకు సమయం అనుకూలంగా ఉంది. విద్యార్థులు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. మీ కృషికి తగ్గ ఫలితం దక్కుతుంది.

మిథునం (Gemini) :ఈ వారం మిథున రాశివారికి అంత అనుకూలంగా లేదు. కుటుంబంలో అనేక సమస్యలు ఏర్పడతాయి. ఫలితంగా మీ మానసికంగా ఆందోళనకు గురవుతారు. వ్యాపార రంగంలోని వారికి మాత్రం ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు మాత్రం.. వేరే చోటుకు బదిలీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తారు. వారం ప్రారంభం మినహా మిగతా సమయం ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం (Cancer) : ఈ వారం కర్కాటక రాశివారికి బాగుంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది. కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉంటే.. నష్టపోయే ప్రమాదం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. వారంలోని చివరి రెండు రోజులు ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు మాత్రం బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది. లేకుంటే సరైన ఫలితాలు రాకపోవచ్చు.

సింహం (Leo) :ఈ వారం సింహ రాశివారికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్యం క్షీణించవచ్చు. మానసిక ఒత్తిడికి గురవుతారు. అయితే వారం మధ్యలో కాస్త బాగుంటుంది. అనుకున్న పనులన్నీ నెరవేర్చుకోగలుగుతారు. ఉద్యోగుల పరిస్థితి కాస్త బాగుంటుంది. వ్యాపారులకు స్వల్ప లాభాలు వస్తాయి. వివాహితులు ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే అవకాశం ఉంది. ప్రేమికులకు మాత్రం ఈ కాలం బాగానే ఉంటుంది. వారంలో చివరి రెండు రోజులు ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి.

కన్య (Virgo) :ఈ వారం కన్య రాశి వారికి గొప్పగా ఉంటుంది. ప్రేమికులు ఒక్కటయ్యే అవకాశం ఉంది. వివాహితులు కూడా ఒకరిపట్ల ఒకరు ప్రేమాభిమానాలతో మెలుగుతారు. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు సంపాదిస్తారు. మీ శక్తి, సామర్థ్యాలతో అన్నింటా విజయం సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలంగా కొనసాగుతాయి. విద్యార్థులకు మాత్రం స్వల్ప ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఆరోగ్యం మాత్రం బాగుంటుంది.

తుల (Libra) :ఈ వారం తుల రాశివారికి బాగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. అయితే మీకు తెలియని రంగంలోకి ప్రవేశించకండి. ఉద్యోగులకు అంతా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగుల ఆదాయం మంచిగా పెరుగుతుంది. వివాహితులు గృహ జీవితాన్ని ఆస్వాదిస్తారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు.

వృశ్చికం (Scorpio) :ఈ వారం వృశ్చిక రాశివారికి అదృష్టం కలిసివస్తుంది. స్నేహితులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. వారం ప్రారంభంలో చేసే ప్రయాణాలు మంచి అవకాశాలను కల్పిస్తాయి. ఖర్చులు వేగంగా పెరుగుతాయి. కనుక జాగ్రత్త వహించాలి. ఉద్యోగుల పరిస్థితి బాగా బాగుంటుంది. పదోన్నతి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా లభించవచ్చు. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. ప్రేమికులకు సమయం అనుకూలంగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.

ధనుస్సు (Sagittarius) :ఈ వారం ధనస్సు రాశివారికి చాలా బాగుంటుంది. అనుకున్న పనులు అన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారం, ఉద్యోగం రెండింటిలోనూ రాణిస్తారు. ఆదాయం మంచిగా పెరుగుతుంది. ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యంపట్ల కాస్త శ్రద్ధ వహించాలి. వారంలో చివరి రోజు మినహా మిగిలిన అన్ని రోజులు ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు చదువుల్లో అనేక ఆటంకాలు ఎదుర్కొంటారు. ప్రేమికులకు మాత్రం అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త!

మకరం (Capricorn) :ఈ వారం మకర రాశివారికి పరిస్థితిలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తరుగుతాయి. ఉద్యోగులకు మాత్రం చిన్నపాటి ఇబ్బందులు ఏర్పడవచ్చు. కోపాన్ని అదుపులో ఉంటుకోవాలి. లేకుంటే అనవసర వివాదాాల్లోకి జారుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు మాత్రం లాభాలు వస్తాయి. వివాహితులు సంతోషంగా గడుపుతారు. కానీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య అపార్థాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త! ఈ వారంలో చేసే ప్రయాణాలు సఫలం అవుతాయి.

కుంభం (Aquarius) : ఈ వారం కుంభ రాశివారికి కాస్త మధ్యస్థంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు స్వల్పమైన ఇబ్బందులు ఏర్పడతాయి. బదిలీ జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. వ్యాపార ప్రణాళికలు మాత్రం విజయవంతం అవుతాయి. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. వివాహితుల శృంగారానుభూతి పొందుతారు. ప్రేమికులు కూడా సంతోషంగా కాలం గడుపుతారు. విద్యార్థులు ఉన్నత విద్యలో గొప్పగా రాణిస్తారు. ఈ వారం మొత్తం ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

మీనం (Pisces) : ఈ వారం మీన రాశివారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. భార్యాభర్తలు కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. ప్రేమికులు ఒక్కటయ్యే అవకాశాలు లభిస్తున్నాయి. మొండి వైఖరి అవలంభిస్తే.. మీరే నష్టపోయే అవకాశం ఉంది. అనుకోని విధంగా ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వారం ప్రారంభంలో, వారం చివరి రెండు రోజులు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది.

ABOUT THE AUTHOR

...view details