తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Weekly Horoscope From 17th To 23th September : ఆ రాశులవారు స్థిరాస్తి వ్యాపారంలో భారీ లాభాలు పొందుతారు! - ఈ వారం ఫలాలు

Weekly Horoscope From 17th To 23th September : సెప్టెంబర్​ 17 నుంచి సెప్టెంబర్​ 23 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Weekly Horoscope in telugu
Weekly Horoscope From 17th To 23th September

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 4:05 AM IST

Weekly Horoscope From 17th To 23th September : సెప్టెంబర్​ 17 నుంచి సెప్టెంబర్​ 23 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

మేషం (Aries) :మేషరాశి వారు వారం ప్రారంభంలో కాస్త జాగ్రత్తలు పాటించాలి. వివాహితుల గృహ జీవితం బాగుంటుంది. భార్యాభర్తలు ఆనందంగా గడుపుతారు. అయితే జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. ప్రేమికులు సంతోషంగా గడుపుతారు. కష్టపడి పని చేస్తారు. దీని వల్ల ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. వ్యాపార వర్గాలకు ఈ వారం తగినంత ఫలవంతంగా ఉంటుంది. మేష రాశివారు ఈ వారం మంచి ప్రయోజనాలు పొందుతారు. కానీ మరోవైపు కొన్ని పనులలో సమస్యలు ఎదురవుతాయి. కొన్ని చట్టపరమైన సమస్యలు కూడా ఉండవచ్చు. వాటిని జాగ్రత్తగా ఎదుర్కోవాలి. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కనుక డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కానీ పిల్లల ఆరోగ్యం గురించి కొన్ని ఆందోళనలు ఉండవచ్చు. ఈ సమయంలో ప్రేమికుల మధ్య విబేధాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ మధ్య దూరం పెరగవచ్చు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి గొడవలు ఏర్పడకుండా చూసుకోవాలి. వివాహితులు తమ జీవిత భాగస్వామి పురోగతితో సంతోషంగా ఉంటారు. మీ ఆదాయం బాగా పెరుగుతుంది. దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారంలో కూడా లాభం ఉంటుంది. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఉద్యోగులకు కూడా ఈ సమయం బాగానే ఉంటుంది. వారు పని ఒత్తిడి నుంచి బయటపడతారు. మీ పై అధికారితో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థులు ఈ సమయంలో చదువుపై దృష్టి పెట్టాలి. ఏకాగ్రతను నిలుపుకోవాలి. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉదర సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ వారం బాగానే ఉంటుంది. వివాహిత జంటలు మంచి వైవాహిక జీవితం గడపుతారు. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రేమికులకు ఈ వారం సాధారణంగా ఉంటుంది. అయితే మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. కుటుంబ బాధ్యతలను నెరవేర్చడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తారు. కుటుంబ సభ్యులు ఏదైనా నిర్దిష్ట సమస్యపై మీతో చర్చిస్తారు. స్థిరాస్తి విషయాలలో మీరు లాభపడతారు. మీరు ఒక ఆస్తిని విక్రయించాలని ఆలోచిస్తున్నట్లయితే, దాని అమ్మకం నుంచి లాభం పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులు తమ స్నేహితులు, సహోద్యోగుల నుంచి సహాయాన్ని పొందుతారు. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ వారం బాగానే ఉంటుంది. వైవాహితులు ఒత్తిడి నుంచి బయటపడతారు. అత్తమామలు మీకు మద్దతు ఇస్తారు. ఈ వారం ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది. మీరు స్నేహితుల సహాయంతో మీ ప్రియమైన వారికి ప్రేమ విషయాన్ని తెలియజేస్తారు. ప్రేయసికి అద్భుతమైన బహుమతిని ఇస్తారు. మీరు అందరితో ప్రేమగా జీవించాలని అనుకుంటారు. కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలోని పెద్దల ఆశీర్వాదంతో, మీ ఆగిపోయిన కొన్ని పనులు పూర్తవుతాయి. కనుక ఇంటి నుంచి బయటకు వెళ్ళే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. వ్యాపారంలో మాత్రం కాస్త ఒడుదొడుకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కానీ క్రమంగా పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులకు ఈ సమయం బాగుంటుంది. మీ ఆరోగ్యం కూడా ఇప్పుడు బాగానే ఉంటుంది.

సింహం (Leo) : సింహం రాశి వారికి ఈ వారం బాగానే ఉంటుంది. ప్రేమ జీవితానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం మీ ప్రయత్నాలు అన్నీ ఫలించే అవకాశం ఉంది. సాహసయాత్రలు చేయాలని తపిస్తూ ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. కానీ అందుకు తగిన ఆదాయం కూడా వస్తుంటుంది. దీని వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారం చేసే వ్యక్తులు మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఈ వారం బాగానే ఉంది. ఆరోగ్యం మాత్రం క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలి.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. వివాహితులు తమ గృహ జీవితంలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. కానీ ఈ సమస్య సులువుగా తీరిపోతుంది. ఇందుకోసం మీ జీవిత భాగస్వామి మీకు పూర్తిగా సహకరిస్తారు. ప్రేమ జీవితానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ప్రియమైనవారితో కలిసిమెలసి జీవిస్తారు. మీకు ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీ ఉన్నతోద్యోగులు మీకు మద్దతుగా నిలుస్తారు. ఇది మీరు మరింత మెరుగ్గా పని చేయడానికి సహాయపడుతుంది. మీరు ఏదైనా వ్యాపారం చేస్తే, ఈ సమయంలో మీ చేతికి పెద్ద ఆర్డర్ రావచ్చు. దీని వల్ల మీకు భారీగా లాభం చేకూరుతుంది. విద్యార్థులకు ఈ సమయం అంత అనుకూలంగా లేదు. కనుక బాగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రయాణాలు చేయడానికి ఈ వారం పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా అంతా బాగుంటుంది.

తుల (Libra) :ఈ వారం తులా రాశి వారికి బాగుంటుంది. వివాహితులు గృహ జీవితాన్ని ఆనందిస్తారు. మీరు మీ జీవిత భాగస్వామితో సుదీర్ఘ ప్రయాణానికి ప్రణాళిక వేస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా వస్తాయి. ప్రేమ జీవితానికి సమయం బాగానే ఉంటుంది. మీ ప్రియమైన వారిని సమస్యల నుంచి తప్పించడానికి సహాయం చేస్తారు. ఈ వారం మీకు కొన్ని ఖర్చులు వస్తాయి. కొత్త వాహనం లేదా భూమి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిం చేస్తారు. అందులో విజయం కూడా సాధిస్తారు. ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఆనందం ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు పొందుతారు. ప్రభుత్వ రంగం నుంచి లబ్ధి పొందుతారు. మీరు ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ మంచి పనితీరును కనబరుస్తారు. విద్యార్థులకు చాలా సవాళ్లు ఎదురవుతాయి. అందువల్ల మీరు చాలా శ్రద్ధగా పని చేసి, మీ ఏకాగ్రతను పెంచుకోవాలి. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కనుక జాగ్రత్త!

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వివాహితులు మంచి గృహ జీవితాన్ని అనుభవిస్తారు. ప్రేమికుల మధ్య చిన్నపాటి మనస్పర్థలు వస్తాయి. కానీ తరువాత కలుసుకుని ఆనందంగా గడుపుతారు. మంచి అనుభూతి పొందుతారు. అకస్మాత్తుగా ఆర్థిక లాభం కలుగుతుంది. ఉద్యోగంలో కూడా పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రమోషన్ కూడా పొందవచ్చు. ముఖ్యంగా కష్టపడి పనిచేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో కూడా విజయం సాధించే బలమైన అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ సమయం బాగానే ఉంటుంది. ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులు రాణించగలుగుతారు. మీరు స్కాలర్‌షిప్ కూడా పొందవచ్చు. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ వారం బాగానే ఉంటుంది. వివాహితులు తమ గృహ జీవితంలో సంతృప్తికరంగా కనిపిస్తారు. జీవిత భాగస్వాముల మధ్య పెరిగిన అంతరం ఇప్పుడు కాస్త తగ్గుతుంది. ప్రేమ జీవితానికి సమయం సహకరిస్తుంది. మీరు, మీ ప్రియమైనవారు.. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మీ ఆదాయం బాగా పెరుగుతుంది. మీరు ఆనంద భావనలతో ఉప్పొంగిపోతారు. ఈ సంతోషంలో కుటుంబ సభ్యులను కూడా కలుపుకుని సంతోషంగా గడుపుతారు. మీరు పెద్ద ఉద్యోగం పొందే అవకాశం ఉంది. కనుక ఆ అవకాశాన్ని వదులుకోకండి. మీరు పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు తమ చదువులపై పూర్తిగా దృష్టి పెడతారు. ఉన్నత విద్యలో కూడా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. మీ ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడుతుంది. కానీ కడుపు నొప్పి సమస్య ఏర్పడవచ్చు.

మకరం (Capricorn) : మకరరాశి వారు ఈ వారం మంచి రాణించే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామి సహకారం, ప్రేమ లభిస్తాయి. అందువల్ల మీ గృహ జీవితం చాలా అనందంగా ఉంటుంది. ప్రేమ జీవితానికి కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రియమైనవారికి మీ ప్రేమ గురించి చెప్పడం మంచిది. ప్రస్తుతం మీ ఆదాయం బాగా పెరుగుతుంది, అలాగే కీలకమైన ఆర్థిక సవాళ్ల నుంచి బయటపడే అవకాశం మీకు లభిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన విషయాలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి. మతపరమైన పనులపై విశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగరీత్యా బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఇది అనుకూలమైన వారం. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒత్తిడి వల్ల సమస్యలు తలెత్తుతాయి. వారం ప్రారంభంలో ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి వారం ప్రారంభంలో కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. మీ పనిలో ఒత్తిడి పెరగవచ్చు. కానీ ధైర్యం కోల్పోకండి. వారం మధ్య నుంచి పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. వివాహితుల గృహ జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో ప్రేమపూర్వక చర్చలు జరుగుతాయి. జీవిత భాగస్వామి తన హృదయంలో ఉన్న అన్ని విషయాలను మీకు చెబుతారు. ప్రేమ జీవితానికి సమయం చాలా మంచిది. మీ సంబంధంలో ఏదైనా వైరుధ్యం ఉంటే, అది ఇప్పుడు తగ్గుతుంది. వ్యాపారంలో లాభం చేకూరుతుంది. అయితే చెడు ప్రభావం చూపే ఎలాంటి పనిని చేయవద్దు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ వారం మధ్యస్థంగా ఉంటుంది. వివాహితులు తమ గృహ జీవితంలో ఆనందంగా గడుపుతారు. ప్రేమికులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చేసే చిన్న పొరపాటు కూడా మీ ప్రియమైనవారి దృష్టిలో పెద్ద తప్పు అవుతుంది. తరువాత వారిని ఒప్పించడం చాలా కష్టం అవుతుంది. వారం ప్రారంభంలో మీకు అంతా అనుకూలంగా బాగుంటుంది. అయితే, ఈ వారం చివరి నాటికి మీ ఖర్చులు భారీగా పెరుగుతాయి. వాటిని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సమయం మీ వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారు సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. మీరు మీ యజమాని దృష్టిని ఆకర్షిస్తే.. ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇందుకోసం మీరు చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వారు ఏదైనా పోటీకి సిద్ధమైతే, కచ్చితంగా విజయం సాధించగలుగుతారు.

ABOUT THE AUTHOR

...view details