తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాశివారికి ఈ వారం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీ లాభాలు! - ఈ వారం ఫలాలు

Weekly Horoscope From 27th December To 23rd December 2023 : ఈ డిసెంబర్​ 17 నుంచి డిసెంబర్​​ 23 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Weekly Horoscope in telugu
Weekly Horoscope From 17th to 23rd December 2023

By ETV Bharat Telugu Team

Published : Dec 17, 2023, 4:50 AM IST

Weekly Horoscope From 27th December To 23rd December 2023 :ఈ డిసెంబర్​ 17 నుంచి డిసెంబర్​ 23 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

మేషం (Aries) :ఈ వారం మేష రాశివారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మేష రాశివారు తమ పనుల్లో చాలా బిజీగా ఉంటారు. వివాహితులు చాలా సంతోషంగా ఉంటారు. కానీ ప్రేమికులకు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ అక్రమ సంబంధాలకు దూరంగా ఉండాలి. లేదంటే పరువుపోయే ప్రమాదం ఉంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ఈ వారం ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. కానీ వారం మధ్యలో ప్రయాణాలు మానుకోవడం మంచిది.

వృషభం (Taurus) :ఈ వారం వృషభ రాశివారు ఉద్యోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. పనిపై శ్రద్ధ చూపకుంటే, అనేక సమస్యలు ఏర్పడతాయి. ఈ వారం మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల కనిపిస్తుంది. కానీ ఖర్చులు కూడా అదే విధంగా పెరుగుతాయి. డబ్బు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వ పనుల్లో చాలా శ్రద్ధ తీసుకొని, సకాలంలో పూర్తి చేయాలి. లేకుంటే సమస్యలు తప్పవు. వైవాహిక జీవితంలో కొంత మేరకు ఒత్తిడి తగ్గుతుంది. వారం ప్రారంభంలో ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

మిథునం (Gemini) :ఈ వారం మిథున రాశివారికి బాగుంటుంది. ఉద్యోగులు తమ ఉన్నతాధికారుల మద్ధతుతో రాణిస్తారు. వివాహితులు కుటుంబంలోని ఒత్తిడులను అధిగమిస్తారు. ప్రభుత్వం నుంచి కూడా మంచి ప్రయోజనాలు పొందుతారు. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. ప్రేమికులు ఒక్కటయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. కానీ తండ్రితో విబేధాలు ఏర్పడవచ్చు. మానసిక ఒత్తిడిలు పెరగవచ్చు. దైవ ధ్యానం చేయడం మంచిది. వారం ప్రారంభంలో ప్రయాణం చేస్తే అనుకూల ఫలితాలు లభిస్తాయి.

కర్కాటకం (Cancer) : ఈ వారం కర్కాటక రాశివారు మానసిక ఒత్తిడిలను అధిగమించే ప్రయత్నం చేయాలి. లేదంటే పరిస్థితులు మరింత దిగజారవచ్చు. ఉదర సంబంధమైన వ్యాధులు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఈ వారంలో మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. కొత్త ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ఉద్యోగులు మంచి పనితీరు కనబరుస్తారు. ప్రేమికులకు మాత్రం ఈ వారం అంతగా కలిసిరాదు. వారం మధ్యలో ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే మంచి ఫలితాలు లభిస్తాయి.

సింహం (Leo) :ఈ వారం సింహ రాశివారికి అనేక ఒడుదొడుకులు ఎదురవుతాయి. వైవాహిక జీవితంలో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయి. ప్రేమికులకు మాత్రం ఈ వారం బాగుంటుంది. వారం మధ్యలో ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు మంచి మార్కులు సంపాదిస్తారు. కష్టపడి పనిచేస్తే కచ్చితంగా మీకు విజయం లభిస్తుంది. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ప్రణాళికాబద్ధంగా వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.

కన్య (Virgo) : ఈ వారం కన్య రాశివారు తమ హృదయంలోని భావాలను తమ ప్రేమికులకు తెలియజేస్తారు. దీనితో మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఫలితంగా ఒకరికొకరు దగ్గర అవుతారు. వివాహితులు తమ జీవిత భాగస్వామి కోరికలను కచ్చితంగా తీర్చాల్సి ఉంటుంది. అత్యవసరాల కోసం రుణాలు చేయాల్సి వస్తుంది. కొత్త వాహనం కొనే అవకాశం కూడా ఉంది. చేపట్టే పనులు అన్నీ చాలా శ్రద్ధగా చేయాలి. అప్పుడే విజయం లభిస్తుంది. వారం మొదటి రోజు చేసే ప్రయాణాలు అనుకూల ఫలితాలను ఇస్తుంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు.

తుల (Libra) :ఈ వారం తుల రాశివారు కుటుంబ వ్యవహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇంటికి అవసరమైన ఖర్చులు చేస్తారు. కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చే ప్రయత్నం చేస్తారు. ప్రేమికులకు ఈ వారం సాధారణంగా గడుస్తుంది. వివాహితులు మాత్రం సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. స్నేహితులు, ప్రియమైన వారు మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తారు. మీ ప్రణాళికలు విజయవంతం అవుతాయి. వారం ప్రారంభంలో ప్రయాణాలు చేస్తే మంచిది. విద్యార్థులు మాత్రం కష్టపడి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి.

వృశ్చికం (Scorpio) :ఈ వారం వృశ్చిక రాశివారికి అద్భుతంగా ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రిస్క్ తీసుకుని కొత్త పనులు ప్రారంభిస్తారు. ఇలా చేపట్టిన అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. స్నేహితుల, కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది. జీవిత భాగస్వామి మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటుంది. ప్రేమికులు శృంగార అనుభూతులను ఆస్వాదిస్తారు. వారం ప్రారంభంలో ప్రయాణాలు చేస్తే సత్ఫలితాలు లభిస్తాయి. విద్యార్థులు చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారులు మంచి ప్రయోజనాలు పొందుతారు. విపరీతమైన లాభాలు కూడా గడిస్తారు. మీ పెట్టుబడులు కూడా భారీ లాభాలను తెచ్చిపెడతాయి.

ధనుస్సు (Sagittarius) : ఈ వారం ధనుస్సు రాశివారు తమ వాక్చాతుర్యంతో ప్రజలందరినీ ఆకట్టుకుంటారు. స్నేహితులు, బంధువుల సాయంతో పనిలో పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో అభివద్ధి చెందుతారు. శ్రద్ధపెట్టి పనిచేస్తారు. కానీ పనుల్లో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అధైర్యపడకండి. మీ కోరికలు అన్నీ నెరవేరుతాయి. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. దీనితో మీరు మానసికంగా చాలా సంతోషపడతారు. కానీ మితిమీరిన అతివిశ్వాసానికి లోనుకాకుండా జాగ్రత్త పడాలి. అహంకారాన్ని విడనాడాలి. వారం ప్రారంభంలో ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు అందుకుంటారు.

మకరం (Capricorn) :ఈ వారం మకర రాశివారికి బాగానే ఉంటుంది. కానీ ఖర్చులు పెరుగుతాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీ ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. వ్యాపారులు కొత్త వ్యక్తులతో కలిసి పనిచేయాలి. అప్పుడే మంచి లాభాలు సంపాదించడానికి వీలవుతుంది. వివాహితులు కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తారు. ప్రేమికుల మధ్య స్వల్ప భేదాభిప్రాయాలు ఏర్పడవచ్చు. అహంభావాన్ని విడనాడితే మంచిది. విద్యార్థులు గురువుల సహకారంలో చదువుకోవాలి. ఈ వారం మొత్తం ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

కుంభం (Aquarius) :ఈ వారం కుంభ రాశివారికి రియల్ ఎస్టేట్ రంగంలో భారీ లాభాలు వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగుల పరిస్థితి బాగుంటుంది. కానీ మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రదర్శించడం ఆపాలి. పనిపై దృష్టి కేంద్రీకరించాలి. వ్యాపారంలో లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సమయాన్ని వీలైనంత వరకు సద్వినియోగం చేసుకోవాలి. వివాహితులు, ప్రేమికులు సంతోషంగా ఉంటారు. ప్రేమికులు విలువైన కానులు ఇచ్చిపుచ్చుకుంటారు. వారం మధ్యలో, చివరి రోజుల్లో ప్రయాణాలు చేస్తే అనుకూల ఫలితాలు లభిస్తాయి. విద్యార్థులు తమ తెలివితేటలతో మంచి ఫలితాలు పొందుతారు.

మీనం (Pisces) : ఈ వారం మీన రాశివారు పనులపై పూర్తి శ్రద్ధ చూపిస్తారు. చాలా జాగ్రత్తగా సకాలంలో పనులను పూర్తి చేస్తారు. వ్యాపారంలో కచ్చితంగా రాణిస్తారు. ఆదాయం మంచిగా పెరుగుతుంది. కానీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులు మీకు అన్ని విధాల సహకరిస్తారు. సహోద్యోగుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రేమికులకు కూడా ఈ వారం బాగానే ఉంటుంది. మీ ప్రేమబంధం దృఢమవుతుంది. శృంగారానుభవం పొందే అవకాశం కూడా ఉంది. వివాహితులు కూడా సంతోషంగా ఉంటారు. వారం మధ్యలో ప్రయాణాలు చేస్తే అనుకూల ఫలితాలు లభిస్తాయి. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు.

ABOUT THE AUTHOR

...view details