తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Weekly Horoscope From 10th To 16th September : ఈ వారం ఆ రాశులవారు జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఖర్చులు పెరిగే ఛాన్స్! - ఈ వారం ఫలాలు

Weekly Horoscope From 10th To 16th September : సెప్టెంబర్​ 10 నుంచి సెప్టెంబర్​ 16 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Weekly Horoscope in telugu
Weekly Horoscope From 10th To 16th September

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 5:06 AM IST

Weekly Horoscope From 10th To 16th September : సెప్టెంబర్​ 10 నుంచి సెప్టెంబర్​ 16 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

మేషం (Aries) :మేషరాశి వారు ఈ వారం చాలా సంతోషంగా గడుపుతారు. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేయవచ్చు. గృహ వ్యయం పెరుగుతుంది. మీ ఆరోగ్యం, మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ బంధం బలపడుతుంది. మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు చాలా శ్రద్ధగా పనిచేస్తారు. ఇంటిలో కూడా పని చేస్తూ బిజీగా ఉంటారు. పనుల్లో వేగం పెరుగుతుంది. ఈ వారం మీరు మంచి ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ వారం బాగానే ఉంటుంది. వివాహితులు వారి గృహ జీవితంలో సంతోషంగా ఉంటారు. ప్రేమ బంధం బలహీనమయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రేమ వ్యవహారాల్లో మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరించాలి. మీరు మీ స్నేహితులతో కలిసి సరదాగా గడిపే అవకాశం లభిస్తుంది. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ బృంద సభ్యులు మీకు మద్ధతుగా నిలుస్తారు. అందువల్ల మీరు మీ పనిని సరిగ్గా చేయగలుగుతారు. ఈ వారం వ్యాపారులకు కూడా అనుకూలంగా ఉంటుంది. మీ కృషి విజయవంతమవుతుంది. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా, ఆనందదాయకంగా ఉంటుంది. విద్యార్థులు చదువుతో పాటు ఇతర పనులపై కూడా శ్రద్ధ చూపుతారు.

మిథునం (Gemini) : మిధునరాశి వారికి ఈ వారం బాగానే ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు ఒకరితో ఒకరు మంచి సమయం గడుపుతారు. ప్రస్తుతం మీరు మీ జీవిత భాగస్వామితో బంధాన్ని మెరుగుపరచుకోవడంపై దృష్టి పెడతారు. ఇంటి వాతావరణం కూడా సానుకూలంగా ఉంటుంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మంచి ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు స్నేహితుల నుంచి కూడా మంచి మద్దతు పొందుతారు. కొందరు వ్యక్తులు మీ మంచితనాన్ని వేరే విధంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యాపారులకు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వాటిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వారం అదృష్టం కూడా మీ వెంటే ఉంటుంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం వైవాహిక జీవితానికి అనుకూలంగా ఉంటుంది. ప్రేమికులు ఒక్కటవుతారు. ఈ వారం మీ పనులు చాలా వరకు విజయవంతమవుతాయి. మీ ఖర్చులు కూడా తక్కువ తక్కువ అవుతాయి. దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు ప్రత్యేకంగా వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులు ఈ వారం కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొంటారు. అయితే మీ పని సామర్థ్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. ఆరోగ్యం కూడా ఈ రాశివారికి బాగానే ఉంటుంది.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో అనుకూలంగా ఉంటుంది. వివాహితులు వారి గృహ జీవితంలో సంతోషంగా ఉంటారు. ఒకరికొకరు చాలా సహకార భావంతో మెలుగుతారు. మీ జీవిత భాగస్వామి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తారు. ప్రేమికులు ఈ వారం చాలా శృంగారభరితంగా గడుపుతారు. వారం ప్రారంభంలో మీరు మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు. ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది. ప్రస్తుతం మీ నాలుక కాస్త కఠినంగా ఉంటుంది. అయితే ప్రజలతో జాగ్రత్తగా మాట్లాడడం అలవరుచుకోండి. వ్యాపారంలో, వ్యక్తిగత జీవితంలో మెరుగుదల కనిపిస్తుంది. మిత్రుల నుంచి మంచి సలహాలు అందుకుంటారు. ఉద్యోగంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీ ప్రయత్నాలు అన్నీ ఫలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు చాలా శ్రద్ధగా, కష్టపడి చదవాల్సి ఉంటుంది.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈ వారం బాగానే ఉంటుంది. వివాహితులు తమ గృహ జీవితంలో కొంత కొత్తదనాన్ని అనుభవిస్తారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ప్రేమికులకు ఈ వారం కలిసి వస్తుంది. మీ ప్రియురాలు మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం మీ శక్తి చాలా బాగా ఉంటుంది. కనుక మీరు తక్కువ సమయంలోనే ఎక్కువ పనిచేయగలుగుతారు. ఈ వారం మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. కొన్ని పాత పనులు తిరిగి ప్రారంభిస్తారు. పోయిన డబ్బు తిరిగి లభిస్తుంది. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు మాత్రం చదువుపై బాగా దృష్టి సారించాల్సి ఉంటుంది.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ వారం చాలా మెరుగ్గా ఉంటుంది. వివాహితులు సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. ప్రేమికులు కూడా బాగా ఆనందంగా ఉంటారు. ఉద్యోగం విషయంలో మాత్రం కాస్త మార్పులు రావచ్చు. మీరు బదిలీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే మీ ఆదాయం బాగా పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి, ఆర్థిక స్థితిలో కూడా బాగా అనుకూలత లభిస్తుంది. వ్యాపారంలోనూ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీ పనిని పూర్తి అంకితభావంతో చేస్తారు. విద్యార్థుల మాత్రం కచ్చితంగా చదువుపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రయాణాలు కూడా మీకు లాభదాయంగా ఉంటాయి. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతా అనుకూలంగా ఉంటుంది. వివాహితులు తమ గృహ జీవితంలో ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో సంబంధం మెరుగ్గా ఉంటుంది. ప్రేమలో ఉన్న వారికి ఈ వారం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. దాని కారణంగా మీ విశ్వాసం బాగా పెరుగుతుంది. ఉద్యోగులు రాణిస్తారు. కుటుంబ వాతావరణం కూడా సానుకూలంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. కానీ విద్యార్థులకు చదువులో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అయినప్పటికీ వారు తమ చదువులపై ఏకాగ్రత వహించే అవకాశం కూడా లభిస్తుంది. ఈ వారం పెద్దగా శారీరక సమస్యలు ఏర్పడవు. చిన్నపాటి సమస్య వచ్చినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని పనుల కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. పరస్పర సమన్వయ లోపం ఉంటుంది. అత్తమామలతో మాత్రం సంబంధాలు కాస్త బాగుంటాయి. ప్రేమికులకు కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రియమైనవారితో శృంగారభరితంగా గడుపుతారు. అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఆర్థిక ఒత్తిడిలకు గురిచేస్తాయి. కానీ ప్రభుత్వ రంగం నుంచి మాత్రం పెద్ద ప్రయోజనం పొందే అవకాశం కనిపిస్తోంది. మీరు సామాజికంగా గౌరవాన్ని పొందుతారు. వారం చివరిలో మీ ఆదాయం కొంత మేరకు పెరుగుతుంది. విద్యార్థులు పరధ్యానం వదిలి చదువుపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ వారం సాధారణంగా ఉంటుంది. వైవాహిక జీవితానికి మాత్రం చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం ఆహ్లాదంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా గడుపుతారు. వారం ప్రారంభంలో వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. మీరు మీ సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఉన్నత పదవులు లేదా స్థానాలు పొందే అవకాశం కూడా ఉంది. అయితే మీ ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు ఉత్తమ ఫలితాలు పొందుతారు.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ వారం ఒడుదొడుకులు ఎదురవుతాయి. గృహ జీవితానికి మాత్రం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ జీవితానికి కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. వారం ప్రారంభంలో కొన్ని అనుకోని ఖర్చులు జరుగుతాయి. కానీ ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. పక్కా ప్రణాళిక ప్రకారం నడుచుకోవాలి. ఉద్యోగులు తమ పనిలో రాణిస్తారు. వ్యాపారులు కూడా లాభాలు గడిస్తారు. ప్రభుత్వ రంగం నుంచి మీరు మంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువులై దృష్టి కేంద్రీకరిస్తారు. వారికి కుటుంబ సభ్యుల సహకారం కూడా లభిస్తుంది. అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం కాస్త ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వివాహితుల గృహ జీవితం చాలా మెరుగ్గా ఉంటుంది. పరస్పర అవగాహన పెరుగుతుంది. ప్రేమికులు ఒక్కటవుతారు. వివాహితులు తమ జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా పని ప్రారంభిస్తే.. అది కచ్చితంగా విజయవంతం అవుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. స్నేహితులు, బంధువులతో కలిసి సరదాగా సమయం గడుపుతారు. కానీ మీ స్వయంకృత తప్పిదాల వల్ల కొంత మంది మీకు శత్రువులుగా మారే అవకాశం ఉంది. జాగ్రత్త! వ్యాపార వర్గానికి ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుతుంది. మిమ్మల్ని మీరు పరిపూర్ణంగా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకోసం బాగా కష్టపడతారు. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. వాళ్లు చదువులో మంచి ఫలితాలు పొందుతారు.

ABOUT THE AUTHOR

...view details