తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకున్నారా? - రాశిఫలం న్యూస్​

Weekly Horoscope: డిసెంబరు 11 నుంచి డిసెంబరు 17 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?

weekly-horoscope
weekly-horoscope

By

Published : Dec 11, 2022, 8:46 AM IST

Weekly Horoscope: డిసెంబరు 11 నుంచి డిసెంబరు 17 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?

గ్రహబలం తక్కువగా ఉంది, మనోబలంతో ముందుకెళ్లాలి. నేర్పుగా లక్ష్యాలు సాధించాలి. వివాదాలకు అవకాశముంది. సౌమ్యంగా వ్యవహరించండి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతి అంశంలోనూ స్పష్టత ఉండాలి. తోటివారిని కలుపుకుని వెళ్లాలి. వ్యాపారంలో శ్రమించాలి. ధనవృద్ధి సూచితం. ఇష్టదేవతా ధ్యానంతో ప్రశాంతత లభిస్తుంది.

విజయం గురించే ఆలోచించండి. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కొన్నింట్లో అనుకూల ఫలితం ఉంటుంది, మరి కొన్నిట్లో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా స్పందించండి. సరైన ప్రణాళికతో కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగం సానుకూలం. వ్యాపారంలో లాభాలుంటాయి. నవగ్రహశ్లోకాలు చదవండి, శక్తి లభిస్తుంది.

మనసు పెట్టి పనిచేయండి. అద్భుతమైన కార్యసిద్ధిని చూస్తారు. ఉద్యోగంలో ఆశించినది లభిస్తుంది. ప్రతి పనీ విశ్లేషణాత్మకంగా ఉండాలి. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. వ్యాపారంలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆటంకాలను అధిగమిస్తారు. ఖర్చు తగ్గించాలి. చంచలత్వం పనికిరాదు. వివాదాలకు తావివ్వవద్దు. ఇష్టదైవ ప్రార్థనతో మనోబలం లభిస్తుంది.

విశేషమైన శుభయోగముంది. బాధ్యతలను పూర్తిచేయండి. సాధనతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. కాలం సహకరిస్తోంది. తగిన సహాయం అందుతుంది. వ్యాపారబలం పెరుగుతుంది. ధర్మమార్గంలో విజయం లభిస్తుంది. ఎదురుచూస్తున్న పనుల్లో పురోభివృద్ధి ఉంటుంది. ఇష్టదైవాన్ని ధ్యానించండి, శాంతి లభిస్తుంది.

సంశయాలు తొలగుతాయి. సత్ఫలితం వస్తుంది. మనోబలం రక్షిస్తుంది. సాంకేతికంగా అభివృద్ధి చెందాలి. వ్యాపారంలో అనుకున్నది సాధిస్తారు. ఆగిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పనులు పూర్తిచేసుకోవాలి. ఆర్థికంగా అనుకూలకాలం నడుస్తోంది. ఇష్ట దైవాన్ని స్మరించండి, కార్యసిద్ధి ఉంటుంది.

అభీష్ట సిద్ధి ఉంటుంది, సకాలంలో పని ప్రారంభిస్తే అద్భుతమైన విజయం సాధించవచ్చు. తోటివారి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. అవాంతరాలను అధిగమించి లక్ష్యాన్ని చేరతారు. కాలం సహకరిస్తోంది. ధనధాన్య లాభాలుంటాయి. రుణ సమస్యలు తొలగుతాయి. వేధిస్తున్న సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. శివధ్యానం మంచిది.

ముఖ్య కార్యాల్లో శ్రద్ధ వహించండి. వ్యతిరేక ఫలితాలు రాకుండా పనిచేయాలి. వాదోపవాదాలతో కాలం వృథా చేయవద్దు. మితభాషణం మంచిది. ఒత్తిడి ఉంటుంది. సకాలంలో పని పూర్తిచేస్తే ప్రశంసలు ఉంటాయి. చంచలత్వం పనికి రాదు. మిత్రుల సహాయం తీసుకోవాలి. వ్యాపారంలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. నవగ్రహశ్లోకాలు చదువుకుంటే మేలు.

వ్యాపారంలో శుభయోగం గోచరిస్తోంది. ధనధాన్య లాభాలుంటాయి. విశేషమైన ఆర్థిక సంపత్తి సమకూరే సూచనలున్నాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లాలి. అధిక గ్రహాలు శుభాన్నిస్తున్నాయి. భూ గృహ వాహనాది యోగాలు ఫలిస్తాయి. కుటుంబపరంగా ఆనందించే అంశాలున్నాయి. కీర్తి లభిస్తుంది. సూర్య నమస్కారం శక్తిని పెంచుతుంది.

శ్రేష్ఠమైన కాలం. సకాలంలో పనులు పూర్తిచేయండి. మేలుచేసేవారున్నారు. ఎంచుకున్న మార్గంలో ముందుకెళ్లండి. అపోహలకు తావివ్వకుండా స్పష్టంగా మాట్లాడాలి. పనుల్ని వాయిదా వేయవద్దు. వ్యాపారంలో చురుగ్గా నిర్ణయాలు తీసుకోవాలి. వారాంతంలో కలిసివస్తుంది. ఇష్టదైవాన్ని నిరంతరం ధ్యానించండి, శక్తి పెరుగుతుంది.

ఉద్యోగంలో ఉన్నత స్థితీ, స్థిరత్వం లభిస్తాయి. సత్ప్రవర్తనతో పెద్దల్ని ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారంలో తెలివిగా వ్యవహరించాలి. సాధ్యాసాధ్యాలను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబసభ్యుల సూచనలు అవసరం. చంచలత్వాన్ని రానివ్వద్దు. ప్రశాంతంగా ఉండాలి. ఇష్టదేవతను ధ్యానిస్తే మంచిది.

ఉద్యోగంలో క్రమంగా అభివృద్ధి లభిస్తుంది. అధికారుల వల్ల మేలు చేకూరుతుంది. ధర్మబద్ధంగా పనుల్ని పూర్తిచేయండి. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. పది మందికీ ఆదర్శవంతులవుతారు. సుఖసౌఖ్యాలుంటాయి. గృహ, భూ, వాహనాది యోగాలుంటాయి. ఆపదలనుంచి బయటపడతారు. పోయినవి తిరిగి లభిస్తాయి. లక్ష్మీధ్యానం శుభప్రదం.

ధైర్యంగా పనిచేయండి, కార్యసిద్ధి ఉంటుంది. సత్యనిష్ఠ, స్పష్టత అవసరం. సంకల్పబలాన్ని బట్టి ఫలితం ఉంటుంది. పనులను మధ్యలో ఆపవద్దు. బంధుమిత్రుల వల్ల కలిసివస్తుంది. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. ధనయోగముంది. వారం మధ్యలో విజయం ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదిత్యహృదయం చదవండి, అనుకున్నది జరుగుతుంది.

ABOUT THE AUTHOR

...view details