Weekly Horoscope: ఈ వారం (ఆగస్టు 7 - 13) మీ రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?
ఏకాగ్రతతో పనిచేయండి. తొందర వద్దు. మొహమాటం ఇబ్బందిపెడుతుంది. సున్నితమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో శ్రమ పెరుగుతుంది. ఒత్తిడికి లోనవకుండా బాధ్యతల్ని నిర్వర్తించండి. ఆర్థిక వృద్ధి సూచితం. నూతన ప్రయత్నాలకు ఇది సమయం కాదు. అపార్థాలకు తావివ్వవద్దు. నవగ్రహశ్లోకాలు చదివితే శాంతి లభిస్తుంది.
శుభకాలం నడుస్తోంది. అన్నివిధాలా కలిసివస్తుంది. విఘ్నాలను అధిగమిస్తారు. శత్రువులు మిత్రులవుతారు. గత వైభవం సిద్ధిస్తుంది. అధికారుల ప్రశంసలు ఉంటాయి. యోగ్యతలను పెంచుకుంటూ ఉన్నత స్థితికి చేరండి. వ్యాపార లాభముంది. కల సాకారమవుతుంది. సుఖసంతోషాలు లభిస్తాయి. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభవార్త వింటారు.
ఉద్యోగ వ్యాపారాల్లో మనోబలంతో ముందుకెళ్లాలి. పట్టుదల, మితభాషణం, సమయస్ఫూర్తి అవసరం. అపార్థాలకు తావివ్వవద్దు. ఆర్థికంగా బాగున్నప్పటికీ ఖర్చు విషయంలో జాగ్రత్త. పలు మార్గాల్లో సంపాదన ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోవాలి. మంచి ఆలోచనలు శక్తినిస్తాయి. ప్రయాణాల్లో లాభముంటుంది. ఆదిత్యహృదయం చదవండి, అవరోధాలు తొలగుతాయి.
గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభఫలితాలున్నాయి. పలు మార్గాల్లో ఆర్థికవృద్ధి లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. భవిష్యత్తుపై దృష్టి నిలపండి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఇంట్లోవారి సూచనలు అవసరం. కలసికట్టుగా పనిచేయాలి. వారాంతంలో అభీష్టసిద్ధి ఉంది. సూర్య నమస్కారం శుభప్రదం.
ఉద్యోగ వ్యాపారాల్లో ముఖ్యకార్యాలను ఏకాగ్రతతో పూర్తిచేయాలి. విఘ్నం ఇబ్బంది పెడుతుంది. పనులను వాయిదా వేయవద్దు. పొరపాట్లు జరగనివ్వవద్దు. కలహాలకు దూరంగా ఉండాలి. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. వారం మధ్యలో ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నవగ్రహధ్యానం చేయండి, శాంతి లభిస్తుంది.
ఉద్యోగబలం ఉంది, గుర్తింపూ గౌరవాలు లభిస్తాయి. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. ఆపదలు తొలగుతాయి. అభివృద్ధిని సాధిస్తారు. విమర్శించినవారే ప్రశంసిస్తారు. వ్యాపారంలో సమస్య ఉంది. ఏదీ లోతుగా తర్కించవద్దు. మితభాషణం మేలుచేస్తుంది. విశ్రాంతి అవసరం. విష్ణు సహస్రనామం చదువుకోండి, ప్రశాంత జీవితం లభిస్తుంది.