తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Weekend Curfew: ఆ రాష్ట్రంలో వారాంతపు కర్ఫ్యూ.. పాఠశాలలు బంద్​ - కర్ణాటకలో కొవిడ్​ రూల్స్​

Weekend Curfew in Karnataka: కొవిడ్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వారాంతపు కర్ఫ్యూ విధిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి కర్ఫ్యూ మరో రెండు వారాలు పొడిగించింది. మరోవైపు అత్యవసర విభాగాల్లో పని చేసే అధికారులు, జడ్జీలు, కోర్టు సిబ్బంది సహా ఇంకొందరికి వారాతంపు, రాత్రి కర్ఫ్యూల నుంచి మినహాయిస్తూ దిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది.

Weekend Curfew
Weekend Curfew

By

Published : Jan 5, 2022, 5:37 AM IST

Weekend Curfew in Karnataka: దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షల విధిస్తున్నాయి. ఇప్పటికే నైట్​ కర్ఫ్యూ అమలు చేస్తున్న కర్ణాటక సర్కారు.. తాజాగా వారాంతపు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి కర్ఫ్యూను మరో రెండు వారాలు పొడిగించింది. దీంతో రెండు వారాలు విద్యాసంస్థలు మూసివేస్తారు. అయితే 10, 12 తరగతి విద్యార్థులకు మినహాయింపు ఇచ్చారు. బుధవారం నుంచి ఈ ఆంక్షలు అమలవుతాయి.

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం బసవరాజ్​ బొమ్మై నేతృత్వంలో వైరస్​ వ్యాప్తిపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఆంక్షలు ఇవే..!

  • మరో రెండు వారాలు నైట్​ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
  • శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు వారాంతపు కర్ఫ్యూ.
  • పబ్బులు, బార్లు, థియేటర్లు, మాల్స్ 50 శాతం సామర్థ్యంతో పనిచేస్తాయి.
  • బహిరంగ ప్రదేశాల్లో 200 మందితో.. పంక్షన్​ హాల్స్​లో అయితే.. 100 మందితో వివాహ వేడుకలు జరుపుకోవచ్చు.
  • రెండు టీకా డోసులు తీసుకున్నవారిని మాత్రమే బహిరంగ ప్రదేశాల్లో అనుమతిస్తారు.
  • పాఠశాలలు, కళాశాలలు మూసివేసి ఉంటాయి.
  • ర్యాలీలు, రాజకీయ సభలకు అనుమతి లేదు.
  • కేరళ, గోవా, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి వచ్చివారికి ఆర్​టీపీసీఆర్​ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరి.

దిల్లీలో నైట్​ కర్ఫ్యూ మినహాయింపు

కొవిడ్​ వ్యాప్తి నేపథ్యంలో విధించిన వారాతంపు, రాత్రి కర్ఫ్యూల నుంచి కొందరికి మినహాయిస్తూ దిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది.

ఎవరెవరికంటే..?

  • తగిన గుర్తింపు కార్డు చూపి.. అత్యవసర విభాగాల్లో విధులు నిర్వహించే అధికారులు అనుమతి పొందవచ్చు.
  • జడ్జీలు, కోర్టు సిబ్బంది కూడా వారాతంపు, రాత్రి కర్ఫ్యూల మినహాయింపు ఉంటుంది.
  • కేంద్ర ప్రభుత్వ విధించిన కొవిడ్​ నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ అధికారులకు అనుమతిస్తారు.
  • వైద్య సిబ్బంది, రోగులు, గర్భిణీ, టీకా తీసుకోవడానికి వెళ్లివారికి, కరోనా పరీక్షలకు వెళ్లినవారికి మినహాయింపు ఉంటుంది.
  • మీడియా సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు లేదా వ్యక్తులను అనుమతిస్తారు.
  • వివాహాలకు హాజరయ్యేవారు పెళ్లికార్డు చూపి అనుమతి పొందవచ్చు.

ఇదీ చూడండి:మహారాష్ట్రలో 18 వేలు- బంగాల్​లో 9 వేల కొత్త కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details