Wedding Bus accident: ఒడిశా గజపతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 35 మందితో వెళ్తున్న పెళ్లి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ జరిగింది
బాధితులంతా.. గంజామ్ జిల్లాలోని బలిపాదర్ గ్రామంలో వివాహానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి తమ స్వగ్రామానికి బయలు దేరారు. ఈ క్రమంలోనే గజపతి జిల్లాలో రాయగడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెబక్పుర్కు సమీపంలో బస్సు ప్రమాదానికి గురైంది.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను పర్లాకిముడిలోని ఆస్పత్రికి తరలించారు. అయితే బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:బలవంతంగా శృంగారానికి ప్రయత్నం.. భర్త అంగం కోసిన భార్య