తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడుకు మరో తుపాను ముప్పు - tamilnadu precyclone update

తమిళనాడుకు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా.. తర్వాత తుపానుగా మారనుంది. ఇది బుధవారం తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

tamilnadu
తమిళనాడుకు మరో తుపాను ముప్పు

By

Published : Dec 1, 2020, 5:42 AM IST

నివర్‌ తుపాను‌ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తమిళనాడుకు మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుంది. తర్వాత తుపానుగా మారే అవకాశముంది. ఈ మేరకు వాతావరణ శాఖ ఓ ప్రకటన చేసింది. ఈ తుపాను బుధవారం శ్రీలంక తీర ప్రాంతాన్ని దాటవచ్చని అంచనా వేసింది. ఈ తుఫాన్​‌ ప్రభావంతో తమిళనాడు, కేరళల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.

ఈ మేరకు దక్షిణ తమిళనాడు, కేరళ ప్రాంతాలకు ఐఎండీహెచ్చరికలు జారీచేసింది. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. ఈ సందర్భంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఇవాళ్టి నుంచి జాలర్లు బంగాళాఖాతంలోని ఆగ్నేయ, నైరుతి ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. ఇప్పటికే చేపల వేటకు వెళ్లినవారు తీరానికి తిరిగి రావాలని కోరారు.

డిసెంబర్ 2 నుంచి 3 మధ్య భారీ వర్షాలు కురవనున్నాయన్న ప్రకటన నేపథ్యంలో కేరళలోని నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్డ్ జారీ అయింది. తిరువనంతపురం, కొల్లం, పథానంతిట్ట, అలప్పుజ జిల్లాలకు ఈ మేరకు హెచ్చరికలు జారీ కాగా.. ఇడుక్కి, ఎర్నాకులం, కొట్టాయం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ అయింది. ఈ ప్రభావంతో వచ్చే 24 గంటల్లో 20 సెం.మీ.లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details