తెలంగాణ

telangana

By

Published : Apr 7, 2021, 11:46 AM IST

ETV Bharat / bharat

'ఒంటరిగా ప్రయాణించినా.. మాస్కు తప్పనిసరి'

ప్రైవేట్ వాహనాల్లో ఒంటరిగా ప్రయాణించే వారు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించాలని దిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా సమయంలో మాస్కు 'సురక్షా కవచం'లా పనిచేస్తుందని అభిప్రాయపడింది.

Wearing of mask while driving alone mandatory during pandemic: HC
'ఒంటరిగా ప్రయాణించే వారికీ మాస్కు తప్పనిసరి'

కొవిడ్-19 నేపథ్యంలో.. ప్రైవేట్​ వాహనాల్లో ఒంటరిగా ప్రయాణించే వారు కూడా తప్పనిసరిగా మస్క్​ ధరించాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. మాస్కును 'సురక్షా కవచం' గా అభివర్ణించింది.

ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేవారు మాస్కు ధరించకపోతే చెలాన్​లను విధిస్తామన్న దిల్లీ ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్​ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ప్రతిభ ఎం. సింగ్ కొట్టివేశారు. దిల్లీ ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోబోమన్నారు.

ఇదీ చదవండి :'జాగ్రత్తలు పాటిస్తూ.. కరోనాపై యుద్ధం చేయాలి'

ABOUT THE AUTHOR

...view details