తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​ నిరసనల్లో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో రాహుల్, ప్రియాంక - కాంగ్రెస్​ నిరసనలు

Congress protest on inflation: కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలు పలుచోట్ల ఉద్రిక్తంగా మారాయి. దిల్లీలో పాదయాత్రగా రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఎంపీలను.. విజయ్ చౌక్​ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్, ప్రియాంక సహా ఇతర నేతల్ని అదుపులోకి తీసుకున్నారు.

congress protest
congress protest

By

Published : Aug 5, 2022, 1:11 PM IST

Updated : Aug 5, 2022, 3:46 PM IST

కాంగ్రెస్​ నిరసనల్లో ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో రాహుల్, ప్రియాంక

Congress protest on inflation: ధరల పెరుగుదల, నిరుద్యోగం, జీఎస్టీ రేట్ల పెంపు అంశాలపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. దిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సహా అనేక మంది నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్​ సహా అదుపులోకి తీసుకున్న ఇతర ఎంపీలను పోలీస్​ లైన్స్​లోని కింగ్స్​వే క్యాంపునకు తరలింంచారు. ప్రజా సమస్యలను లేవనెత్తడమే తమ కర్తవ్యమని.. ఈ విధులు నిర్వర్తించినందుకు తమ ఎంపీలను అదుపులోకి తీసుకుంటాన్నరని రాహుల్ ఆరోపించారు.

క్యాంపులో కాంగ్రెస్ నేతలు
పార్లమెంట్​ భవనం వద్ద నిరసన తెలుపుతున్న రాహుల్​, సోనియా, ఇతర ఎంపీలు
నిరసనలో పాల్గొన్న రాహుల్ గాంధీ

అంతకుముందు.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా పలువురు ఎంపీలు పార్లమెంట్​లో నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. పాదయాత్రగా రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఎంపీలను.. విజయ్ చౌక్​ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు. రాహుల్​ గాంధీ సహ కాంగ్రెస్​ కార్యకర్తలు వర్షంలోనూ నిరసనలను కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు.. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ నేతలతో కలిసి ఆందోళనల్లో పాల్గొన్న ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీగా అక్కడికి చేరుకున్న మహిళా పోలీసులు బలవంతంగా ప్రియాంకను వాహనంలోకి ఎక్కించారు.

మహిళా ఎంపీలతో సోనియా గాంధీ
ఏఐసీసీ కార్యాలయం వద్ద ప్రియాంక గాంధీ
నిరసనల్లో పాల్గొన్న కార్యకర్తలు
నిరసన చేపట్టిన కార్యకర్తలు
నిరసనల్లో రాహుల్​
Last Updated : Aug 5, 2022, 3:46 PM IST

ABOUT THE AUTHOR

...view details