తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఐదేళ్లలో చొరబాట్లు లేని రాష్ట్రంగా బంగాల్'

భాజపా అధికారంలోకి వస్తే బంగాల్​ను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఐదేళ్లలోనే రాష్ట్రాన్ని బంగారు బంగాల్​గా మార్చుతామని చెప్పారు. టీఎంసీ సర్కార్​పై విమర్శలు గుప్పించారు. భాజపా అధికారంలోకి వస్తే ఏ పండగ నిర్వహించుకునేందుకైనా తాము అభ్యంతరం వ్యక్తం చేయబోమని స్పష్టం చేశారు.

amit shah
అమిత్ షా బంగాల్ పర్యటన

By

Published : Mar 21, 2021, 1:43 PM IST

Updated : Mar 21, 2021, 3:34 PM IST

టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఇచ్చిన నినాదాల వల్ల బంగాల్​లో ఎలాంటి మార్పు రాలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. చొరబాటుదార్లను ఆపలేకపోయారని అన్నారు. తూర్పు మెదినీపుర్​లోని ఈగ్రాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. బంగాల్​ను ఐదేళ్లలోనే చొరబాటు రహిత రాష్ట్రంగా మార్చుతామని హామీ ఇచ్చారు.

బంగాల్​లో అరాచకాలు పెరిగిపోతున్నాయని అమిత్ షా ధ్వజమెత్తారు. పాఠశాలల్లో సరస్వతి పూజ నిర్వహించినందుకు ఉపాధ్యాయులపై దాడులు చేశారని మండిపడ్డారు. భాజపా అధికారంలోకి వస్తే ఏ పండగ నిర్వహించుకునేందుకైనా తాము అభ్యంతరం వ్యక్తం చేయబోమని స్పష్టం చేశారు. కేంద్రం, రాష్ట్రంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో ఐదేళ్లలోనే రాష్ట్రాన్ని 'బంగారు బంగాల్​'గా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగుల కోసం ఏడో వేతన కమిషన్​ను అమలు చేస్తామని చెప్పారు అమిత్ షా.

"దీదీ.. మా, మాటి, మనుష్(తల్లి, మట్టి, మనషులు) అనే నినాదాన్ని ఇచ్చారు. కానీ ఏదైనా మార్పు వచ్చిందా? చొరబాటుదారుల నుంచి విముక్తి కల్పించారా? మేము బంగాల్​ను ఐదేళ్లలోనే చొరబాటు రహిత రాష్ట్రంగా మార్చుతాం.

130 మంది కార్యకర్తలను చంపేశారు. టీఎంసీ గూండాలూ... మేము మిమ్మల్ని విడిచిపెడతామని అనుకోవద్దు. మే 2న బంగాల్​లో అధికారంలోకి వచ్చాక తగిన చర్యలు తీసుకుంటాం."

-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

ఈ ప్రచార సభలో.. షా సమక్షంలో సువేందు అధికారి తండ్రి, టీఎంసీ ఎంపీ సిసిర్ అధికారి భాజపాలో చేరారు. అనంతరం.. అరాచకాల నుంచి బంగాల్ రాష్ట్రాన్ని కాపాడాలని కోరారు.

సిసిర్ అధికారి

ఇదీ చదవండి:'కాంగ్రెస్​ అంటేనే అబద్ధాలు, అస్థిరత, అవినీతి'

Last Updated : Mar 21, 2021, 3:34 PM IST

ABOUT THE AUTHOR

...view details