తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చక్రాల కుర్చీపై దీదీ ర్యాలీ- తరలివెళ్లిన ప్రజలు - attack on mamata

కాలినొప్పి వేధిస్తున్నా.. తాను ధైర్యంగా పోరాడతానని తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి, బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. చక్రాల కుర్చీలోనే కోల్​కతాలో ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు.

We will continue to fight boldly! I'm still in lot of   pain, but I feel pain of my people even more: Mamata Banerjee.
చక్రాల కుర్చీపైనే మమతా బెనర్జీ ర్యాలీ

By

Published : Mar 14, 2021, 2:39 PM IST

Updated : Mar 14, 2021, 3:09 PM IST

ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ

కాలికి గాయమైన నాలుగు రోజుల తర్వాత టీఎంసీ అధినేత్రి, బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కోల్​కతా​లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చక్రాల కుర్చీపైనే ర్యాలీ చేపట్టారు. ఆమె వెంట టీఎంసీ సీనియర్​ నేతలు పాల్గొన్నారు.

మమత చక్రాల కూర్చీలో కూర్చోగా.. భద్రతా సిబ్బంది దానిని ముందుకు నడిపించారు. ర్యాలీలో భారీ సంఖ్యలో హాజరైన ప్రజలకు మమత అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

మమత వెంటే నేతలు

నందిగ్రామ్ దివస్​ సందర్భంగా.. మాయో రోడ్డు నుంచి హజ్రా వరకు ఐదు కిలోమీటర్ల దూరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు దీదీ. తాము ఎవరికీ తలవంచబోమని ర్యాలీ పాల్గొనే ముందు మమత ట్వీట్​ చేశారు.

"ధైర్యంగా పోరాడుతూ ముందుకు సాగుతాం. నాకు నొప్పి చాలా ఉంది. కానీ రాష్ట్ర ప్రజల్లో ఉన్న బాధ కంటే ఇది ఎక్కువేమీ కాదూ. బంగాల్​ గడ్డను రక్షించుకోవడానికి ఎన్నో పోరాటాలు చేశాం. కానీ, ఏనాడు ఎవరికీ తలవంచలేదు."

--- మమతా బెనర్జీ, బంగాల్​ సీఎం.

ఎన్నికల నామినేషన్​ వేసేందుకు ఈ నెల 10న నందిగ్రామ్​ వెళ్లిన మమత.. అక్కడ గాయపడ్డారు. తనపై దాడి జరిగిందని ఆరోపించిన ఆమె.. కోల్​కతాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. రెండు రోజుల అనంతరం డిశ్చార్జ్​ అయ్యారు.

ఇదీ చూడండి:-బంగాల్​ దంగల్​: గాయాలే దీదీ విజయానికి సోపానాలు!

Last Updated : Mar 14, 2021, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details