సింఘు సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతు తెలిపారు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. రైతులు చేస్తున్న డిమాండ్లు సమ్మతమైనవని చెప్పారు. డిసెంబర్ 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్కు ఆమ్ఆద్మీపార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. బంద్ విజయవంతం చేయాలని ఆప్ కార్యకర్తలకు సూచించారు.
రైతుల ఆందోళనలకు మద్దతు తెలిపిన దిల్లీ సీఎం - farmers protest delhi
డిసెంబర్ 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్కు ఆమ్ఆద్మీ పార్టీ మద్దతిస్తుందని తెలిపారు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. సింఘు సరిహద్దులో ఆందోళనలు చేసిన రైతులను కలిసి, అక్కడి ప్రభుత్వ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఈ మేరకు ప్రకటన చేశారు. రైతులు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవని, కష్టకాలంలో ఉన్న వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.
సింఘు సరిహద్దులోని గుర్ తేగ్ బహదూల్ స్మారకం వద్దకు వెళ్లి నిరసన చేస్తున్న రైతులను కలిశారు కేజ్రీవాల్. ప్రభుత్వం వారి కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. దిల్లీ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆప్ నాయకులు, కార్యకర్తలు రైతులకు సేవకులుగా సేవలందిస్తున్నట్లు చెప్పారు. తాను కూడా సేవకుడిగానే సీఎం హోదాలో రైతుల వద్దకు వచ్చినట్లు పేర్కొన్నారు. కష్టకాలంలో ఉన్న అన్నదాతలకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. రైతులకు తాము మొదటి నుంచి మద్దతుగానే ఉన్నట్లు తెలిపారు కేజ్రీవాల్. దిల్లీలోని 9 స్టేడియాలను తాత్కాలిక జైళ్లుగా మార్చాలని కేంద్రం ఒత్తిడి చేసినప్పటికీ తాను ఒప్పుకోలేదని గుర్తు చేశారు.