నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు చేస్తోన్న ఆందోళనలు 25వ రోజుకు చేరుకున్నాయి. దిల్లీలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలకు పడిపోయినా రైతులు వెనక్కి తగ్గడం లేదు. వణికించే చలిలోనూ నిరసన తెలుపుతున్నారు.
ఘాజిపూర్ సరిహద్దు వద్ద నిరసనలో పాల్గొన్న రైతులు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి దేశ రాజధాని దిల్లీకి వెళ్లే ఘాజిపూర్ సరిహద్దును మూసివేస్తామని కర్షకులు హెచ్చరించారు.
నివాళులు..
నిరసనలు ప్రారంభమైన నాటి నుంచి ఉద్యమంలో భాగంగా చనిపోయిన రైతులకు.. నివాళులు అర్పించారు. రైతు అమరవీరులకు గుర్తుగా శ్రద్ధాంజలి దివస్ పేరుతో ఆందోళనలు చేస్తున్నారు. సింఘూ, టిక్రీ, ఘాజిపుర్ వద్ద రైతు సంఘాల నేతలు, రైతులు సంతాపం ప్రకటించారు.
చలో దిల్లీకి పిలుపు తర్వాత పలు కారణాలతో33మంది రైతులు మరణించినట్లు చెబుతున్నారు.
దిల్లీ-యూజీ సరిహద్దు ఘాజీపూర్ను మూసేస్తామంటోన్న రైతు నేతలు ఈ నేపథ్యంలో అన్నదాతలకు దేశ నలుమూలల నుంచి మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా పంజాబ్ వాసులు రైతుల కోసం దిల్లీకి తరలివెళుతున్నారు. పంజాబ్‌లోని వివిధ ఆస్పత్రులకు చెందిన వైద్యబృందం సింఘూ సరిహద్దుకు చేరుకుంది. నిరసనలో భాగంగా.. ఎవరైనా అనారోగ్యం పాలైతే చికిత్స కూడా అందించనున్నట్లు లూథియానాకు చెందిన ఓ నర్సు పేర్కొన్నారు.
అనారోగ్యంతో ఉన్నవారికి వైద్య సేవలందించేందుకు వచ్చిన వైద్య సిబ్బంది అనారోగ్యంతో రైతుల కుటుంబీకులు సింఘూ సరిహద్దులో 25వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు ఇదీ చదవండి:రైతులకు మద్దతుగా టాటూ ఆర్టిస్టుల స్టాల్