దేశ వ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతంగా వ్యాపిస్తున్న వేళ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉందని, దీనిని అదుపు చేసేందుకు మిలటరీ బలగాలు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాణాంతక స్థితిలో వైరస్ వ్యాప్తి చెందుతున్నా ప్రజల్లో భయం లేకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
"కొవిడ్ వ్యాప్తిపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు ప్రభుత్వం తరఫున లేఖలు రాస్తాం. వైరస్ విస్తృతిని అరికట్టేందుకు కేంద్ర బలగాలను ఝార్ఖండ్‌లో మోహరించాలని కోరతాం" అని సోరెన్ మీడియాకు వివరించారు.