తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నీటి సంరక్షణ పట్ల బాధ్యతను గుర్తించాలి: మోదీ - PM calls for 100-day campaign to clean up water bodies, harvest rain water

నీటి సంరక్షణ పట్ల బాధ్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు నీటి కుంటలను శుభ్రపరచాలని కోరారు. దీనిపై వందరోజుల క్యాంపెయిన్ ప్రారంభించాలని అన్నారు. సైన్స్ దినోత్సవం సందర్భంగా.. దేశంలోని శాస్త్రవేత్తల గురించి విద్యార్థులు తెలుసుకోవాలని సూచించారు.

PM Modi to address Mann Ki Baat today
'నీటి సంరక్షణ పట్ల బాధ్యతను గుర్తించాలి'

By

Published : Feb 28, 2021, 11:28 AM IST

Updated : Feb 28, 2021, 12:43 PM IST

నీటి సంరక్షణను సమష్టి బాధ్యతగా గుర్తించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మన్​కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రసంగించిన ఆయన.. జీవం కొనసాగేందుకు, అభివృద్ధి సాధించేందుకు నీరే ప్రధానమని అన్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే నీటి కుంటలను శుభ్రపరిచేందుకు వంద రోజుల క్యాంపెయిన్ ప్రారంభించాలని పిలుపునిచ్చారు. తద్వారా వర్షపు నీరు నిల్వ కోసం వాటిని సిద్ధం చేయొచ్చని అన్నారు. ఇందుకు సంబంధించి కొద్ది రోజుల్లో జల్ శక్తి మంత్రిత్వ శాఖ 'క్యాచ్​ ది రెయిన్' కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. వర్షం కురిసిన చోటే, కురిసిన సమయంలోనే నీటిని ఒడిసిపట్టడం కార్యక్రమం నినాదమని పేర్కొన్నారు.

"ఈ ఏడాది మాఘమాసంలో కుంభమేళకు హరిద్వార్ ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 22న ప్రపంచ నీటి సంరక్షణ దినాన్ని జరుపుకుంటాం. నీటికీ మాఘమాసానికి సంబంధం ఏంటంటే.. ఈ నెల తర్వాత శీతాకాలం ముగిసి, వేసవి ప్రారంభమవుతుంది. కాబట్టి నీటి పరిరక్షణ గురించి ఆలోచించడానికి ఇదే సరైన సమయం. కొద్దిరోజుల్లో జల్ శక్తి మంత్రిత్వ శాఖ 'క్యాచ్ ది రెయిన్' కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. ఈ సీజన్​లో కాజీరంగా జాతీయ పార్కులో 112 పక్షి జాతులు కనిపించాయి. నీటి సంరక్షణ, మానవుల జోక్యం తగ్గించడమే ఇందుకు కారణం."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఆదివారం జాతీయ సైన్స్ దినోత్సవం అని గుర్తు చేసిన మోదీ.. ప్రముఖ శాస్త్రవేత్త సీవీ రామన్ కనుగొన్న 'రామన్ ఎఫెక్ట్​'కు ఈ రోజు అంకితమని అన్నారు. దేశంలోని యువత శాస్త్రవేత్తల గురించి పూర్తిగా తెలుసుకోవాలని, భారత శాస్త్రీయ చరిత్రను చదవాలని కోరారు. ఆత్మనిర్భర్ భారత్​ విషయంలో సైన్స్ అందించే సహకారం ఎనలేనిదని అన్నారు.

సైన్స్​కు మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. 'ల్యాబ్ నుంచి ల్యాండ్​' అన్న నినాదంతో సైన్స్​ను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎల్​ఈడీ బల్బుల పరిశ్రమలో పనిచేసి, సొంత ఊరిలో తయారీ కేంద్రాన్ని నెలకొల్పిన బిహార్​కు చెందిన ప్రమోద్​ గురించి ప్రస్తావించారు. ఇలా ఎందరో ఆత్మనిర్భర్ భారత్​కు సహకారం అందిస్తున్నారన్నారు. స్వదేశీ ఉత్పత్తులను చూసి ప్రజలు గర్వంగా భావిస్తే.. ఆత్మనిర్భర్ ఆర్థిక కార్యక్రమంగా మిగిలిపోదని, జాతీయ స్ఫూర్తిగా మారుతుందని అన్నారు.

తమిళ భాషపై...

ప్రపంచంలో పురాతన భాష అయిన తమిళంను నేర్చుకోలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు మోదీ. 'ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఇన్ని సంవత్సరాల కాలంలో మీరు కోల్పోయిన విషయమేదైనా ఉందా అని నన్ను కొందరు అడిగారు. ప్రపంచంలోని అతి పురాతన భాష అయిన తమిళంను నేర్చుకొనేందుకు సరైన ప్రయత్నాలు చేయకపోవడమే నేను కోల్పోయిన విషయమని భావిస్తాను. తమిళ భాష అందమైనది' అని చెప్పుకొచ్చారు ప్రధాని.

ఇదీ చదవండి:లీటరు పాలు రూ.100- రైతుల తీర్మానం

Last Updated : Feb 28, 2021, 12:43 PM IST

ABOUT THE AUTHOR

...view details