కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా 70రోజులుగా కర్షకులు చేస్తున్న పోరాటం ఉవ్వెత్తున సాగుతోంది. కేంద్రం.. చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఇళ్లకు వెళ్లేది లేదని ఇప్పటికే స్పష్టం చేశారు రైతులు.
'40 లక్షల ట్రాక్టర్లతో దేశవ్యాప్త ర్యాలీ'
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేస్తున్న ఆందోళనలు 70వ రోజుకు చేరాయి. అక్టోబర్ వరకు ప్రభుత్వానికి గడువు ఇచ్చినట్టు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ తెలిపారు. ప్రభుత్వం దిగిరాకపోతే.. దేశవ్యాప్తంగా ట్రాక్టర్ ర్యాలీ చేపడతామని హెచ్చరించారు.
రాకేశ్ టికాయత్, భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు
ఈ క్రమంలో.. సాగు చట్టాలపై అక్టోబర్ వరకు ప్రభుత్వానికి గడువు ఇచ్చామన్నారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్. ఈలోగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే.. ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. 40లక్షల ట్రాక్టర్లతో దేశవ్యాప్తంగా ర్యాలీ చేపడతామని ప్రకటించారు.