ప్రతిపక్షాలను వేధింపులకు గురిచేసేందుకు కేంద్ర సంస్థలను భాజపా తన అస్త్రాలుగా మలుచుకుంటోందని ఆరోపించారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. భాజపా గూటి చిలుకగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మారిపోయిందని అన్నారు. తన భార్య వర్షా రౌత్‌కు ఈడీ సమన్లు పంపిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మా ప్రభత్వం భయపడదు. ఈడీ మాకు పెద్ద విషయమే కాదు. ఈడీ చేస్తున్న ప్రతి చర్య రాజకీయ పూరితమే అని ప్రజలు ఎప్పుడో గ్రహించారు. నా భార్య పదేళ్ల క్రితం ఓ ఇల్లు కొందామని రూ.50 లక్షల అప్పు తీసుకుంది. ఇన్నాళ్లకు ఈడీ ఈ విషయంపై ప్రశ్నిచేందుకు మేల్కొంది. కానీ మేము ఎప్పటికప్పుడు ఈడీకి పత్రాలు అందజేశాము. "