బంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ మేనిఫెస్టో విడుదల వాయిదా పడింది. ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై స్పష్టత లేదు. ప్రణాళిక ప్రకారం.. మేనిఫెస్టోను గురువారం ప్రకటించాల్సి ఉండగా.. ఆ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీపై బుధవారం దుండగులు దాడి చేసిన నేపథ్యంలో టీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది.
నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న దీదీ.. బుధవారం నామినేషన్ వేశారు. ఈ క్రమంలో అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు తనను నెట్టివేశారని మమత ఆరోపించారు. ఈ ఘటనలో ఆమె ఎడమ కాలి ఎముక, చీలమండలో పగులు వచ్చిందని వైద్యులు వెల్లడించారు. అంతేకాకుండా.. మెడ, కుడి భుజం, మోచేయికి దెబ్బలు తగిలాయని వివరించారు. ఆమె కాలికి ఎంఆర్ఐ స్కానింగ్ చేసినట్టు తెలిపిన వైద్యులు.. సీటీ స్కాన్, ఇతర పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం.. దీదీ ఎస్ఎస్కేఎమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.