బంగాల్లో భాజపా నేత రాహుల్ సిన్హా చేసిన వ్యాఖ్యలను ఎన్నికల సంఘం ఖండించింది. ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనకుండా 48 గంటలపాటు నిషేధం విధించింది. కూచ్ బిహార్, సీతల్కుచిలో జరిగిన కాల్పుల్లో "కేంద్ర బలగాలు నలుగురిని కాదు.. ఎనిమిది మందిని కాల్చివేసి ఉండాల్సింది" అంటూ రాహుల్ సిన్హా వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ఈ మేరకు చర్యలు తీసుకుంది.
మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు నిషేధం అమల్లో ఉండనుంది.