దిల్లీ వాసులను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున మరోసారి కుండపోతగా వాన కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. 46ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతమని అధికారులు తెలిపారు. రహదారులు నదులను తలపిస్తున్నాయి. పలు చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎయిర్‌పోర్ట్‌లోకి వరద..
వర్షం కారణంగా దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా వరదనీరు చేరింది. రన్‌వే, టర్మినల్ 3 ప్రాంతాల్లో నీరు నిలిచింది. ఏకధాటిగా కురిసిన వానకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు చోట్ల రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరింది.