యమునా నదిలో అమోనియా (water pollution in yamuna) ప్రమాదక స్థాయికి చేరుకుంది. దీంతో దిల్లీలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా స్తంభించింది. వాజిరాబాద్ ప్రాంతంలోని యుమునా నదిలో అమోనియా స్థాయి 3పీపీఎమ్ (పార్ట్స్ పర్ మిలియన్) ఉన్నట్లు అధికారులు తెలిపారు. తాగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లపై ఈ ప్రభావం పడినట్లు వెల్లడించారు.
హరియాణా నుంచి వెలువడిన పారిశ్రామిక వ్యర్థాలు యమునా నది నీటిలో ప్రవహిస్తున్నందున నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని దిల్లీ నీటి సరఫరా బోర్డ్ వైస్ ఛైర్మన్ రాఘవ్ చద్ధా తెలిపారు. దేశ రాజధానిలో తూర్పు, ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని వెల్లడించారు.
"నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరుతున్నాను. తగిన సంఖ్యలో నీటి ట్యాంకర్లను కూడా అందుబాటులో ఉంచాము. యమునా నది నీటిలో అమోనియా స్థాయి పెరగడం వల్ల నీటి సరఫరా ప్రభావం పడింది"