తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య మందిరం కోసం 115 దేశాల నుంచి జలం

115 దేశాల నుంచి నీటిని అయోధ్యలోని రామమందిరం(Ayodhya Ram Mandir) కోసం సేకరించడం.. వసుధైక కుటుంబం అనే సందేశాన్ని ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ పేర్కొన్నారు. దిల్లీలో పలు దేశాల రాయబారుల సమక్షంలో 115 దేశాల నుంచి సేకరించిన నీటిని ఆయన అందుకున్నారు.

ayodhya 115 countries water
అయోధ్యకు 115 దేశాల నీరు

By

Published : Sep 18, 2021, 10:06 PM IST

అయోధ్యలో రామమందిరం(Ayodhya Ram Mandir) కోసం ఏడు ఖండాల్లోని 115 దేశాల నుంచి నీటిని సేకరించడం.. ఒక వినూత్న ఆలోచన అని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) అన్నారు. ఇది వసుధైక కుటుంబం సందేశాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన చెప్పారు. రామ జన్మభూమి క్షేత్ర ట్రస్టు(Ayodhya Ram Mandir) ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, పలు దేశాల రాయబారుల సమక్షంలో.. 115 దేశాల నుంచి సేకరించిన నీటిని రాజ్‌నాథ్‌ సింగ్ దిల్లీలోని తన నివాసంలో అందుకున్నారు.

ఈ నీటిని సేకరించిన దిల్లీకి చెందిన ఓ ఎన్​జీఓను రాజ్​నాథ్​ ప్రశంసించారు. మిగిలిన 77 దేశాల నుంచి కూడా నీటిని ఆ సంస్థ సేకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ గొప్ప పనికి హిందువులతోపాటు ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, యూదులు, బౌద్ధులు సహకరించారని చంపత్ రాయ్ తెలిపారు. వివిధ దేశాల నుంచి నీటిని 115 చిన్న కుండలలో సేకరిస్తున్నట్లు రాయ్ చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details