తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతుల ఆందోళనల్లో ఉద్రిక్తత- జలఫిరంగుల ప్రయోగం! - రైతుల ఆందోళనలు

రైతుల చేపట్టిన 'సేవ్ అగ్రికల్చర్​ సేవ్​ డెమొక్రసీ' కార్యక్రమం దిల్లీ సరిహద్దు వద్ద ఉద్రిక్తతలకు దారి తీసింది. ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల మీద పెద్దసంఖ్యలో దిల్లీ సరిహద్దులకు చేరుకున్న రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడం వల్ల ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. అన్నదాతలను నిలువరించేందుకు పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసినప్పటికీ రైతులు ట్రాక్టర్లతో వెళ్లేందుకు ప్రయత్నించారు. మరోవైపు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని రైతు సంఘం నాయకులు తేల్చి చెప్పారు.

farmers protest
అన్నదాతల ఆందోళన

By

Published : Jun 26, 2021, 5:19 PM IST

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేపట్టిన ఉద్యమం నేటికి 7 నెలలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌ రైతులు నిర్వహించిన ర్యాలీ చండీగఢ్-దిల్లీ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల మీద పెద్దసంఖ్యలో దిల్లీ సరిహద్దులకు చేరుకున్న రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో సరిహద్దుల వద్ద ఉద్రిక్తత నెలకొంది. అన్నదాతలను నిలువరించేందుకు పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు.. ముళ్ల కంచెలు ఏర్పాటు చేసినప్పటికీ రైతులు ట్రాక్టర్లతో వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులు కొంత మంది రైతు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలు ఏడు నెలలు పూర్తైన సందర్భంగా సాగు చట్టాలను నిరసిస్తూ.. 'సేవ్ అగ్రికల్చర్ సేవ్​ డెమొక్రసీ' పేరుతో అన్ని రాష్ట్రాల గవర్నర్‌లకు అన్నదాతలు వినతిపత్రాలు సమర్పించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.

అన్నదాతల ఆందోళనలు
అన్నదాతల ఆందోళనలు
అన్నదాతల ఆందోళనలు

పంచకులాలో ఉద్రిక్తత..

పంచకులాలో రైతుల ర్యాలీ

గవర్నర్​కు మెమోరాండం సమర్పించేందుకు రైతులు భారీగా తరలి వెళ్లడం వల్ల పంచకులా-చండీగఢ్ సరిహద్దు వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గవర్నరే స్వయంగా అన్నదాతల వద్దకు వచ్చి మెమోరాండం తీసుకుంటారని తొలుత అధికారులు చెప్పారు. అయినా రైతులు వినిపించుకోలేదు. దీంతో చేసేదేమి లేక పోలీసులు బారీకేడ్లను తొలగించి రైతులను ముందుకు పంపారు. దీంతో వేలాది మంది అన్నదాతలు రాజ్​భవన్​వైపు ర్యాలీగా వెళ్లారు.

ఉద్యమం ఆగదు..

రాకేశ్ టికాయిత్ ఇంటర్వ్యూ

కేంద్రం సాగు చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు తమ పోరాటం ఆపే ప్రసక్తే లేదని గాజీపుర్​ సరిహద్దులో రైతు సంఘం నాయకుడు రాకేశ్ టికాయిత్​ తేల్చిచెప్పారు. దిల్లీ సరిహద్దులో నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆందోళనలు నిర్వహిస్తున్న రైతుల్లో కొందరు ఇంటికి వెళ్తే వారి స్థానంలో కొత్త వారు వస్తారని, ఈ ప్రక్రియను ఇలాగే కొనసాగిస్తూ.. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. దిల్లీ సరిహద్దుకు వచ్చిన రైతులు.. దిల్లీలోకి వెళ్లరని రాకేశ్ టికాయిత్ స్పష్టం చేశారు. ఒకవేళ దిల్లీ వెళ్లాలని ప్రణాళిక రూపొందిస్తే 4 లక్షల ట్రాక్టర్లతో ర్యాలీగా వెళ్తామన్నారు.

ఉగ్రవాదులన్నా పట్టించుకోం..

నరేశ్ టికాయిత్​

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాలు రోడ్డెక్కి 7 నెలలు పూర్తయినా కేంద్రం తమ డిమాండ్లను పెడచెవిన పెడుతోందని భారతీయ కిసాన్ యూనియన్​(బీకేయూ) జాతీయ అధ్యక్షుడు నరేశ్ టికాయిత్ ఆవేదన వ్యక్తం చేశారు.

" దేశంలోని 90శాతం మంది ప్రజలను కేవలం 10 శాతం మంది ఏకపక్షంగా విస్మరించలేరు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. మంత్రులకు స్వేచ్ఛ ఇవ్వలేదు. కేంద్ర వ్యవసాయ మంత్రిని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేందుకు అనుమతించినట్లయితే రైతుల సమస్య ఎప్పుడో పరిష్కారమై ఉండేది" అని అన్నారు.

ప్రస్తుత క్లిష్ట సమయంలో రైతుల కోసం పోరాడటం తప్ప తనకు మరో ఉద్దేశం లేదని నరేశ్ టికాయిత్ అన్నారు. తమను కొందరు ఉగ్రవాదులని, ఖలీస్థానీలని, ఆందోళన్​ జీవి అని రకరకాలుగా పిలుస్తుస్తున్నారని, కానీ అవేం తాము పట్టించుకోబోమని స్పష్టం చేశారు. నష్టాల్లో ఉన్న వ్యవసాయ రంగం కోసమే పోరాడుతున్నామన్నారు. కేంద్రం ఇప్పటికే చాలా ఎక్కువ సమయం తీసుకుందని, చేసిన తప్పులను అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

బారీకేడ్ల తొలగింపు..

చండీగఢ్-మొహాలీ సరిహద్దులో పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను అన్నదాతలు తొలగించారు.

ABOUT THE AUTHOR

...view details