Tamil Nadu News: ఈనెల 26 నుంచి ఏడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తమిళనాడును ముంచెత్తాయి. చెన్నైలోని అంబత్తూర్, వీఓసీ నగర్ సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి. వరదల కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది.
మరోవైపు తిరుచ్చిలో కూడా వరద ప్రభావం తీవ్రంగా ఉంది. సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు వరదల్లో చిక్కుకున్న పలువురిని బోటు సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాల నేపథ్యంలో 11 జిల్లాల్లోని స్కూల్స్, కాలేజీలకు సోమవారం సెలవు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.