ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం (Modi Birthday Celebration) సందర్భంగా వివిధ ప్రాంతాల్లో భాజపా కార్యకర్తలు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మోదీ 71వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కార్యకర్తలు.. 71 అడుగుల కేక్‌ను తయారు చేయించారు. వ్యాక్సిన్ రూపంలో ఉన్న ఈ భారీ కేక్‌ను ప్రధాని మోదీకి అంకితం ఇస్తూ టీకా పంపిణీ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
"ఈ రోజు ప్రజాసేవకు ప్రత్యేకమైనదిగా భావిస్తున్నాము. మోదీ పుట్టినరోజు సందర్భంగా మొత్తం 71 మంది రక్తదానం చేశారు. 71 అడుగుల కేక్‌ను కూడా కట్ చేశాము. ప్రధాని.. ఇలాగే ప్రజాసేవ కొనసాగించాలని ఆశిస్తున్నాము."
-భాజపా కార్యకర్త
ఇందోర్‌లో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గీయ.. దివ్యాంగ చిన్నారుల మధ్య వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో కలిసి పాటలు పాడారు.
71 కేజీల లడ్డూ..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రధాని సొంత నియోజకవర్గమైన వారణాసిలో దీపాలు వెలిగించి.. మోదీ పుట్టినరోజు వేడుకలను (Modi Birthday News) నిర్వహించారు కార్యకర్తలు. ఈ సందర్భంగా 71 కిలోల లడ్డూను కోసి సంబరాలు (Modi Birthday Celebration) చేసుకున్నారు. భాజపా ఎంపీ రూపా గంగూలీ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ జీసీ త్రిపాఠి ఆధ్వర్యంలో 'కాశీ సంకల్ప్' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.