తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆహారం వృథా చేయటం అంటే పేదలను దోచుకోవటమే' - రాహుల్ గాంధీ తాజా వార్తలు

ఆహారాన్ని వృథా చేయడం అంటే.. పేద ప్రజలను దోచుకోవడంతో సమానమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ వ్యాఖ్యానించారు. దేశంలో గత మూడేళ్ల కాలంలో రూ.406 కోట్ల ఆహార ధాన్యాలు వృథా అయ్యాయని చెప్పారు.

rahul gandhi
రాహుల్ గాంధీ

By

Published : Aug 11, 2021, 7:21 PM IST

ఆహార ధాన్యాల నిర్వహణలో ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆహారాన్ని వృథా చేయడమంటే పేద ప్రజలను దోచుకోవడమేనని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ఆయన ఓ పోస్ట్​ చేశారు. రాహుల్​ తన పోస్ట్​కు గత మూడేళ్ల కాలంలో దేశంలో రూ.406 కోట్ల విలువైన ఆహార ధాన్యాలు వృథా అయ్యాయని చెప్పే ఓ పత్రికా కథనాన్ని జోడించారు.

రాష్ట్రాల్లోని ధాన్యాగారాల్లో భద్రతా లోపాల వల్ల రూ.406 కోట్ల ఆహార ధాన్యాలు పాడయ్యాయని రాహుల్​ షేర్ చేసిన పత్రికా కథనం చెబుతోంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీ తన నివేదికలో చెప్పినట్లుగా సదరు పత్రికా కథనం పేర్కొంది. "ఆహారాన్ని వృథా చేయడం అంటే.. పేదలను దోచుకోవడం రెండూ ఒకటే." అంటూ రాహుల్..​ తన పోస్టుకు #GOIwastes అనే హ్యాష్​ట్యాగ్​ను జత చేశారు.

ఆహార ధాన్యాలు వృథా కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీ తన నివేదికలో తెలిపింది. వాటిని భద్రపరిచేందుకు తగిన శాస్త్రీయ పద్ధతులు అలవంబించాలని చెప్పింది. ఒకవేళ పాడైపోతే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణించాలని పేర్కొంది.

ఇదీ చూడండి:ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాలుగేళ్ల స్ఫూర్తి ప్రయాణం

ఇదీ చూడండి:గురువారం మహిళల ఖాతాల్లో రూ.1,625 కోట్లు జమ!

ABOUT THE AUTHOR

...view details