Warangal, Telangana Election Result 2023 Live : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 10 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. కేవలం రెండు సీట్లలో మాత్రమే బీఆర్ఎస్ గెలుపొందింది.
Congress Wins Nine Seats in Warangal District : ములుగు నుంచి సీతక్క(కాంగ్రెస్) గెలవగా, మహబూబాబాద్ నియోజకవర్గంలో మురళీ నాయక్(కాంగ్రెస్), నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో దొంతి మాధవరెడ్డి(కాంగ్రెస్), వర్ధన్నపేటలో నాగరాజు(కాంగ్రెస్) గెలుపొందారు. పాలకుర్తిలో యశస్విని(కాంగ్రెస్) విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓటమి పాలయ్యారు. భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఏకైక సీటును కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు గెలుచుకున్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో కేఆర్ నాగార్జున(కాంగ్రెస్) గెలిచారు.
జనగాం నుంచి పోటీ చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి(బీఆర్ఎస్) సమీప అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని ఓడించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి(బీఆర్ఎస్) విజయం సాధించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నియోజకవర్గాల వివరాలు :
- భూపాలపల్లి : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు గెలుపొందారు.
- డోర్నకల్ :కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జె.రామచంద్ర నాయక్ విజయం సాధించారు.
- మహబూబాబాద్ : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మురళీ నాయక్ భూక్య విజయం సాధించారు.
- ములుగు : ములుగు నియోజకవర్గంలో డీ. అనసూయ సీతక్క విజయం సాధించారు.
- నర్సంపేట : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహదేవ రెడ్డి విజయం సాధించారు.
- పరకాల : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్ రెడ్డి గెలుపొందారు.
- వర్ధన్నపేట : ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఆర్ నాగార్జున విజయం సాధించారు.
- వరంగల్ తూర్పు : కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ఈ ఎన్నికలో గెలుపొందారు.
- వరంగల్ పడమర : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి విజయం సాధించారు.
- జనగాం : ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు.
- పాలకుర్తి : కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఓడించారు.
- స్టేషన్ ఘన్పూర్ : కడియం శ్రీహరి