ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాణిగంజ్ నియోజకవర్గంలో చేపడుతున్న ఓ కళాశాల భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపాలను ఎండగట్టారు అక్కడి సమాజ్‌వాదీ ఎమ్మెల్యే డా.ఆర్కే వర్మ. గురువారం క్షేత్రస్థాయిలో తనిఖీకి వచ్చిన ఆయన.. కేవలం చేత్తో నెడితేనే కూలిపోతున్న ఆ నిర్మాణాల వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇది నాలుగు అంతస్తుల ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్ భవన నిర్మాణమని పేర్కొన్నారు.
"ఇటువంటి నాసిరకం పనులతో ప్రభుత్వం.. యువత భవిష్యత్తును నిర్మించడం లేదు. వారి మరణానికి ఏర్పాట్లు చేస్తోంది. రూ.కోట్ల వ్యయంతో చేపడుతున్న పనుల్లో అవినీతి.. ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది. దీనిపై విచారణ జరిపించాలి."
- డా.ఆర్కే వర్మ, రాణిగంజ్ ఎమ్మెల్యే