అన్నా డీఎంకే బహిష్కృత నేత శశికళ జైలు నుంచి బుధవారం అధికారికంగా విడుదలయ్యారు. ఆమె రాకతో తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనే విషయం చర్చనీయాంశమైంది. దీనిపై శశికళ మేనల్లుడు, ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్ స్పందించారు. ఇకపై తమిళ రాజకీయాల్లో శశికళ ప్రభావం ఏమేరకు ఉంటుందో తెలియాలంటే కొద్దికాలం వేచి చూడాలన్నారు.
చిన్నమ్మ విడుదలతో తమిళ రాజకీయాల్లో మార్పులు? - ttv Dhinakaran Sasikala
అక్రమాస్తుల కేసులో శశికళ విడుదలతో తమిళనాడు రాజకీయాల్లో వచ్చే మార్పులు ఏంటో తెలియాలంటే కొద్దికాలం వేచి చూడాలని అన్నారు ఏఎంఎంకే నేత దినకరన్. శశికళ విడుదలైన రోజునే జయలలిత స్మారకం ప్రారంభించడంపై తనదైన శైలిలో స్పందించారు.
![చిన్నమ్మ విడుదలతో తమిళ రాజకీయాల్లో మార్పులు? Wait and see: TTV Dhinakaran, AMMK leader and nephew of Sasikala when asked will her release change the political spectrum](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10397201-thumbnail-3x2-img.jpg)
చిన్నమ్మ విడుదలతో తమిళ రాజకీయాల్లో మార్పులు!
మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత స్మారకాన్ని అన్నాడీఎంకే అగ్రనేతలు బుధవారం ప్రారంభించడం శిశకళ విడుదలైన సందర్భంగా చేసుకునే వేడుకలకు నిదర్శనమని దినకరన్ అన్నారు. ఇవి తమకు సంతోషకరమైన క్షణాలని చెప్పారు. శశికళ చెన్నై ఎప్పుడు రావాలనే విషయంపై వైద్యుల సలహా మేరకు నిర్ణయం తీసుకుంటామని, ఆమె రాక కోసం తమిళనాడు ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.