అన్ని రాష్ట్రాల గవర్నర్లతో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సమావేశం కానున్నారు. వర్చువల్‌గా జరగనున్న ఈ భేటీలో కరోనా పరిస్థితి సహా వ్యాక్సినేషన్‌పై చర్చించనున్నారు.
టీకా పంపిణీ కార్యక్రమం సహా పెరుగుతున్న కొవిడ్ కేసులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో టీకా ఉత్సవ్' ఫలితాలపైనా సమావేశంలో చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.