కర్ణాటకలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ ఓటింగ్ కొనసాగుతోంది. పార్టీ గుర్తు లేకుండానే ఎన్నికలు జరుగుతున్నా... భాజపా, కాంగ్రెస్, జేడీయూ స్థానికంగా పట్టు సాధించాలని భావిస్తున్నాయి.
మంగళవారం 2,930 పంచాయతీల్లో ఓటింగ్ జరుగుతోంది. మరో 2,832 స్థానాల్లో డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 30న లెక్కింపు ప్రక్రియ జరగనుంది. స్థానిక పోరులో... దాదాపు 5,000 మంది అభ్యర్థులు ముందుగానే ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం.