బిహార్ ఎన్నికల చివరి దశ ఓటింగ్లో... తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముజఫర్పూర్ ప్రాంతంలోని స్థానికులు కాలువపైన ఓ తాత్కాలిక బ్రిడ్జిని నిర్మించుకున్నారు. ఈ ప్రాంతం నుంచి పోలింగ్ కేంద్రానికి వెళ్లాలంటే తప్పకుండా ఓ కాలువ దాటాలి. అయితే చాలా మంది ఈ కాలువ దాటేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్బంగా ఈ బ్రడ్జి నిర్మించారు.
ఓటర్ల సంకల్పం- ఓటేయడం కోసం బ్రిడ్జి నిర్మాణం
బిహార్ ఎన్నికలు చివరి దశకు చేరుకున్న వేళ... రాష్ట్రంలోని ముజఫర్పూర్ ప్రాంత ప్రజలు ఓటు వేయడాన్ని బాధ్యతగా భావించారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లడానికి సౌకర్యాలు లేకపోయినా.. ఎలాగైనా ఓటు వేయాలని సంకల్పించారు. ఓటర్లే స్వయంగా కాలువపై బ్రిడ్జిని నిర్మించుకొని.. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటేయడం కోసం బ్రిడ్జి నిర్మించి!
ఈ తరుణంలో ఎలాగైనా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనే సంకల్పంతో స్థానిక ప్రజలు కట్టెలతోనే ఓ బ్రిడ్జిని నిర్మించారు.
ఇదీ చదవండి:బంగాల్ వడియాలకు దశాబ్దాల చరిత్ర