తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్థిరంగా బీజేపీ ఓట్​బ్యాంక్​.. 4 శాతం పెరిగిన కాంగ్రెస్​ ఓట్​షేర్.. మరి నోటాకు ఎన్ని? - karnataka elections jds

Karnataka Election Results 2023 : కర్ణాటకలో కాంగ్రెస్‌ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. హస్తం పార్టీ తన ఓట్ల వాటాను 4 శాతానికి పైగా మెరుగుపరుచుకుని 135 స్థానాల్లో విజయబావుటా ఎగరేసింది. గతంలో 36 శాతంగా ఉన్నా బీజేపీ ఓట్ల శాతం ఇప్పుడు కూడా స్ధిరంగానే ఉంది. మరోవైపు 2018 ఎన్నికలతో పోలిస్తే జేడీఎస్​ ఓట్ల శాతం 5 శాతం పడిపోయింది. అయితే ఈ ఓట్ల శాతంలో నోటా వాటా ఎంతంటే ?

karnataka-election-results-2023
karnataka-election-results-2023

By

Published : May 14, 2023, 9:25 AM IST

Karnataka Election Results 2023 : కర్ణాటక ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ.. 2018లో జరిగిన ఎన్నికల కంటే ప్రస్తుత ఎన్నికల్లో తమ ఓట్లను నాలుగు శాతం మేర పెంచుకుంది. 2018లో కాంగ్రెస్ 38.04 ఓట్ల శాతాన్ని సొంతం చేసుకోగా.. ఇప్పుడు ఆ సంఖ్య 42.88 శాతానికి ఎగబాకింది. ఈ క్రమంలో గతంలో కంటే నాలుగు శాత అధిక ఓట్లతో హస్తం పార్టీ.. అప్పటికంటే 57 స్థానాలను అధికంగా కైవసం చేసుకుంది.

1999లో.. 40.84 శాతం, 1989లో 43.76 ఓట్‌ షేర్‌తో ఏకంగా 178 స్థానాల్లో హస్తం పార్టీ విజయ దుందుభిని మోగించింది. 2018లో 18.36 శాతం ఉన్న జేడీఎస్​ ఓట్లు.. ఇప్పుడు భారీగా పడిపోయాయి. అయితే ఈ ఎన్నికల్లో జేడీఎస్​కు 13.29 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2018లో 36.22 ఓటు శాతంగా ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు.. ఈసారి కూడా అంతే స్థిరంగా ఉంది.

కల్యాణ కర్ణాటక పరిధిలో 41 స్థానాలకు 2018లో 20 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు 26 స్థానాల్లో గెలుపొందింది. ఈ ప్రాంతంలో బీజేపీ 17 నుంచి 10 స్థానాలకు పడిపోయింది. ఈ ఫలితాల్లో 12 మంది కాంగ్రెస్‌ సభ్యులు 50వేలకు పైగా మెజారిటీ సాధించారు. కనకపుర స్థానం నుంచి గెలుపొందిన కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ లక్షా 22 వేల మెజారిటీతో గెలుపొందారు. మరో పదకొండు స్థానాల్లో కాంగ్రెస్‌కు 50 వేలకుపైగా మెజార్టీ వచ్చింది.

కాంగ్రెస్‌, జేడీఎస్‌ల నుంచి 2019లో బీజేపీకి ఫిరాయింపులు జరిపి ప్రభుత్వాన్ని కూల్చిన ఎమ్మెల్యేల్లో 8 మంది ఈ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. మరో ఆరుగురు గెలుపొందారు. ఇద్దరు పోటీకి దూరంగా ఉన్నారు. బెంగళూరు సౌత్ నియోజకవర్గంలో ఎం క్రిష్ణప్ప వరుసగా నాలుగో సారి విజయాన్ని అందుకున్నారు. కాంగ్రెస్ నేత ఆర్కే రమేష్​పై 49,699 ఓట్ల తేడాతో గెలుపొందారు.

నోటాకు 2,59,278 ఓట్లు
కర్ణాటక ఎన్నికల్లో 2,59,278 ఓటర్లు నోటాకు ఓటేశారు. శనివారం మధ్యాహ్నం 3.30 గంటల వరకు అందిన లెక్కల ప్రకారం ఓటు వేసిన 3.84 కోట్ల మందిలో 2,59,278 (0.7 శాతం) మంది నోటాను ఎంచుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులెవరూ నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు ఈ అవకాశం కల్పించింది.

ABOUT THE AUTHOR

...view details