తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీకి ఓటు వేస్తే స్కీములు- టీఎంసీతో స్కాములే' - 'స్కీములా? స్కామ్​లా? మీరే తేల్చుకోండి'

బంగాల్​ ప్రజలకు పథకాలు కావాలంటే మోదీకి ఓటు వేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా పిలుపునిచ్చారు. టీఎంసీకి ఓటు వేస్తే కుంభకోణాలే జరుగుతాయని ఆరోపించారు. బంగాల్​లో ఉద్యోగాలను సృష్టించడంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విఫలమయ్యారని విమర్శించారు.

Vote for Modi if you want schemes,for TMC if you prefer scams: Amit Shah
'మోదీకి ఓటు వేస్తే స్కీములు.. టీఎంసీతో స్కాములే'

By

Published : Mar 25, 2021, 3:12 PM IST

ఉద్యోగాలను సృష్టించడంలో బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విఫలమయ్యారని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా విమర్శించారు. ఆటోమొబైల్​ పరిశ్రమను రాష్ట్రంలో ఏర్పాటు చేయలేకపోయారని దుయ్యబట్టారు.

పురులియా జిల్లా బాగ్​ముండిలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

"మీకు పథకాలు కావాలంటే మోదీకి ఓటు వేయండి. లేదా కుంభకోణాలు కావాలనుకుంటే అసమర్థ టీఎంసీకి ఓటు వేయండి. ఏది కావాలో నిర్ణయించుకోవాల్సింది మీరే."

-అమిత్​ షా, కేంద్ర హోం మంత్రి

జంగల్​మహల్​ ప్రాంతంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎయిమ్స్​ నిర్మిస్తామని అమిత్​ షా హామీ ఇచ్చారు. టీఎంసీ నడుపుతున్న కట్​ మనీ సంస్కృతిని తాము అంతం చేస్తామని అన్నారు. ఆదివాసీలు, కుర్మీ కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

బంగాల్​లో యూపీ సీఎం

రాష్ట్రాభివృద్ధిని విస్మరించి.. తన గూండాలు, రౌడీల ప్రయోజనాల కోసమే బంగాల్​ సీఎం మమతా బెనర్జీ పని చేస్తున్నారని ఉత్తర్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్​ విమర్శించారు. దక్షిణ 24 పరగణాలు జిల్లా సాగర్​ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

35 రోజుల తర్వాత బంగాల్​లో టీఎంసీ పాలన అంతమై.. భాజపాతో నూతన శకం ఆరంభమవుతుందని జోస్యం చెప్పారు యోగి. అంఫన్​ తుపాను సాయం కింద కేంద్రం అందించిన నిధులను టీఎంసీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details