VK Singh On POK : పాక్ ఆక్రమిత కశ్మీర్ పీవోకేపై కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ ఛీఫ్ జనరల్ వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పీవోకే భారత్‌లో కలిసిపోతుందని.. అందుకు కొంత కాలం వేచి ఉండాలని అన్నారు. రాజస్థాన్‌లోని దౌసాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీవోకేప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేయాలంటూ అక్కడి ప్రజలు చేస్తున్న డిమాండ్లపై మీడియా కేంద్ర మంత్రిని ప్రశ్నించింది. అందుకు స్పందించిన కేంద్రమంత్రి.. పాక్ ఆక్రమిత కశ్మీర్ పీవోకే తనంతట తానే భారత్‌లో విలీనమవుతుందన్నారు. అయితే అందుకు కొంత సమయం పట్టొచ్చన్నారు. మరోవైపు భారతదేశంలో కలుస్తామంటూ ఇటీవలే పీవోకే ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి వీకే సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి .
యుద్ధం అన్నది ఏ దేశ ఆర్థిక వ్యవస్థని అయినా తక్కువలో తక్కువ ఇరవై ఏళ్లు వెనక్కి నెడుతుంది. అందువల్ల యుద్ధం చేయాలనుకునే ముందు మనం ఆలోచించాలి. దీని ద్వారా మనం ఏం చేయాలి, దాని తర్వాత ఎలాంటి పరిస్థితులు వస్తాయి అని ఆలోచించాలి. మేం ఏమని భావిస్తాం అంటే యుద్ధం ఎప్పడూ చివరి ఉపాయం మాత్రమే. చూడండి పీవోకే మన భారత్‌లోకి వస్తుంది. అయితే అందుకు కొద్ది సమయం పడుతుంది.
-వీకే సింగ్, కేంద్ర మంత్రి