తెలంగాణ

telangana

ETV Bharat / bharat

LIVE UPDATES: విజయనగరం రైలు ప్రమాద ఘటనాస్థలంలో పట్టాలు పునరుద్ధరణ.. గూడ్స్ వెళ్లిన తర్వాత పట్టాలపై నడిచిన ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ - accident

Train_Accident_Live_Updates
Train_Accident_Live_Updates

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 6:38 AM IST

Updated : Oct 30, 2023, 4:26 PM IST

16:25 October 30

విజయనగరం: రైలు ప్రమాద స్థలం వద్ద సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

  • విజయనగరం: రైలు ప్రమాద స్థలం వద్ద సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే
  • క్షతగాత్రులను పరామర్శించాక ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం జగన్‌

15:03 October 30

విజయనగరం: రైలు ప్రమాద ఘటనాస్థలంలో పట్టాలు పునరుద్ధరణ

  • విజయనగరం: రైలు ప్రమాద ఘటనాస్థలంలో పట్టాలు పునరుద్ధరణ
  • పట్టాలపై గూడ్స్‌ను ట్రయల్‌ రన్‌ నడిపిన అధికారులు
  • విశాఖ-విజయనగరం డౌన్‌లైన్ ట్రాక్ వైపు గూడ్స్ నడిపిన అధికారులు
  • గూడ్స్ వెళ్లిన తర్వాత పట్టాలపై నడిచిన ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌

14:12 October 30

విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శిస్తున్న సీఎం

  • విజయనగరం ప్రభుత్వాసుపత్రికి ముఖ్యమంత్రి జగన్‌
  • రైలు ప్రమాదానికి సంబంధించిన ఫొటోలను పరిశీలించిన సీఎం
  • ప్రమాద వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్న సీఎం జగన్‌
  • విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులకు సీఎం పరామర్శ

13:09 October 30

రైలు ప్రమాద ఘటనాస్థలికి కాకుండా నేరుగా ఆస్పత్రికి వెళ్లనున్న సీఎం

  • సీఎం జగన్ విజయనగరం జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు
  • రైలు ప్రమాద ఘటనాస్థలికి కాకుండా నేరుగా ఆస్పత్రికి వెళ్లనున్న సీఎం
  • ట్రాక్ పునరుద్ధరణ పనుల దృష్ట్యా సీఎం పర్యటనలో మార్పులు
  • సీఎం వస్తే పునరుద్ధరణ పనులు ఆలస్యమవుతాయన్న రైల్వే అధికారులు
  • ఘటాస్థలికి వెళ్లకుండా ఆస్పత్రికి మాత్రమే వెళ్లనున్న సీఎం జగన్‌
  • ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్న సీఎం

12:46 October 30

ప్రమాదంపై జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం: బొత్స

ప్రమాదంపై జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం: బొత్స

రైల్వే అధికారులకు అన్నివిధాలుగా సహకరిస్తున్నాం: బొత్స

గంటసేపట్లో ట్రాక్‌ పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు తెలిపారు: బొత్స

12:08 October 30

యుద్ధప్రాతిపదికన ట్రాక్ పురుద్ధరణ పనులు జరుగుతున్నాయి: డీఆర్‌ఎం

  • యుద్ధప్రాతిపదికన ట్రాక్ పురుద్ధరణ పనులు జరుగుతున్నాయి: డీఆర్‌ఎం
  • అనుకున్న ప్రకారం జరిగితే మధ్యాహ్నానికి ట్రాక్ పునరుద్ధరిస్తాం: డీఆర్‌ఎం
  • రైలు ప్రమాదంపై విచారణ జరుగుతోంది: వాల్తేరు రైల్వే డీఆర్‌ఎం
  • గాయపడినవారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం: వాల్తేరు రైల్వే డీఆర్‌ఎం
  • అన్ని విభాగాల సమన్వయంతో పనిచేస్తున్నాం: వాల్తేరు రైల్వే డీఆర్‌ఎం

11:19 October 30

విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీపీఎం

  • విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీపీఎం
  • మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి: సీపీఎం
  • బాధితులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి: సీపీఎం నేత రాఘవులు

11:16 October 30

విజయనగరం రైలు ప్రమాదస్థలికి వెళ్లనున్న సీఎం జగన్‌

  • విజయనగరం రైలు ప్రమాదస్థలికి వెళ్లనున్న సీఎం జగన్‌
  • విజయవాడ నుంచి విశాఖకు ప్రత్యేక విమానంలో సీఎం
  • మధ్యాహ్నం 12.30కు విశాఖ విమానాశ్రయం చేరుకోనున్న సీఎం
  • విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో అలమండ స్టేషన్‌కు వెళ్లనున్న సీఎం
  • రైలు ప్రమాదస్థలిని పరిశీలించిన అనంతరం విజయనగరం వెళ్లనున్న సీఎం
  • విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించనున్న సీఎం

10:54 October 30

విశాఖ చేరుకున్న రైల్వే సేఫ్టీ అధికారుల బృందం

  • విశాఖ చేరుకున్న రైల్వే సేఫ్టీ అధికారుల బృందం
  • సికింద్రాబాద్‌లోని కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ నుంచి అధికారుల బృందం
  • ప్రత్యేక రైలులో విశాఖ నుంచి ఘటనాస్థలికి బయల్దేరిన బృందం

10:33 October 30

విజయనగరం రైలు ప్రమాదంపై నారా భువనేశ్వరి దిగ్భ్రాంతి

  • విజయనగరం రైలు ప్రమాదంపై నారా భువనేశ్వరి దిగ్భ్రాంతి
  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన భువనేశ్వరి
  • బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: భువనేశ్వరి
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి: నారా భువనేశ్వరి

10:04 October 30

విజయనగరం రైలు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తుల వివరాలు

  • విజయనగరం రైలు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తుల వివరాలు
  • ప్రమాదంలో విశాఖకు చెందిన లోకో పైలట్‌ ఎస్‌.ఎం.ఎస్‌.రావు మృతి
  • రైలు ప్రమాదంలో పలాస ప్యాసింజర్‌ గార్డు ఎం.శ్రీనివాస్‌ మృతి
  • విజయనగరం కొత్తవలసకు చెందిన గ్యాంగ్‌మెన్‌ కృష్ణంనాయుడు మృతి
  • విజయనగరం జిల్లా గొడికొమ్ము వాసి కంచుబరకి రవి మృతి
  • శ్రీకాకుళం జిల్లా రామచంద్రాపురం వాసి గిరిజాల లక్ష్మి మృతి
  • విజయనగరం జిల్లా కాపుసంభం వాసి కరణం అప్పలనాయుడు మృతి
  • విజయనగరం జిల్లాకు చెందిన చల్లా సతీష్‌ మృతి
  • విజయనగరం జిల్లా కాపుసంభం వాసి పిల్లా నాగరాజు మృతి
  • విజయనగరం జిల్లా గడబవలస వాసి మజ్జి రాము మృతి
  • శ్రీకాకుళం జిల్లా మెట్టవలస వాసి టెంకాల సుగుణమ్మ మృతి
  • విజయనగరం జిల్లా రెడ్డిపేట వాసి రెడ్డి సీతంనాయుడు మృతి

08:43 October 30

ఉదయం 11 గంటలకు రైలు ప్రమాదస్థలికి సీఎం జగన్‌

  • ఉదయం 11 గంటలకు రైలు ప్రమాదస్థలికి సీఎం జగన్‌
  • హెలికాప్టర్‌లో అలమండకు వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్‌
  • అలమండ నుంచి ప్రత్యేక రైలులో ఘటనాస్థలికి సీఎం జగన్‌
  • ఘటనాస్థలి పరిశీలన అనంతరం విజయనగరం వెళ్లనున్న సీఎం
  • విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో బాధితులను పరామర్శించనున్న సీఎం

08:35 October 30

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం, 14 మంది మృతి

  • విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం, 14 మంది మృతి
  • ఇప్పటివరకు 13 మృతదేహాలు వెలికితీసిన సహాయ బృందాలు
  • విజయనగరం: రైలు ప్రమాదంలో 100 మందికి పైగా గాయాలు
  • విశాఖ-రాయగడ ప్యాసింజర్‌లోని ఇద్దరు లోకో పైలట్లు మృతి
  • విజయనగరం: పలాస ప్యాసింజర్‌ గార్డు ఎం.ఎస్‌.రావు మృతి
  • ప్రమాద మృతుల్లో కొత్తవలసకు చెందిన గ్యాంగ్‌మెన్‌ కృష్ణంనాయుడు
  • విజయనగరం ప్రభుత్వాస్పత్రికి మృతదేహాల తరలింపు
  • విజయనగరం: కొత్తవలస మం. భీమాలి వద్ద ప్రమాద ఘటన
  • ఒడిశా బాలేశ్వర్‌ రైలు ప్రమాదం తరహాలో ఘటన

08:07 October 30

రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లు రద్దు

  • రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లు రద్దు
  • కోర్బా - విశాఖ(18517) ఎక్స్‌ప్రెస్‌ రద్దు
  • పారాదీప్ - విశాఖ(22809) ఎక్స్‌ప్రెస్‌ రద్దు
  • రాయగడ – విశాఖ(08503) ప్యాసింజర్ స్పెషల్ రద్దు
  • పలాస - విశాఖ(08531) ప్యాసింజర్ స్పెషల్ రద్దు
  • విశాఖ – గుణుపుర్(08522) ప్యాసింజర్ స్పెషల్ రద్దు
  • గుణుపుర్ - విశాఖ(08521) ప్యాసింజర్ స్పెషల్ రద్దు
  • విజయనగరం - విశాఖ(07469) మెమూ స్పెషల్ రద్దు
  • విజయవాడ - విశాఖ(12718) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ రద్దు
  • విశాఖ - విజయవాడ(12717) రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ రద్దు
  • గుంటూరు - విశాఖ(12739) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రద్దు
  • కాకినాడ - విశాఖ(17267) మెమూ ఎక్స్‌ప్రెస్‌ రద్దు
  • విశాఖ - కాకినాడ(17268) మెమూ ఎక్స్‌ప్రెస్‌ రద్దు
  • రాజమండ్రి - విశాఖ(07466) మెమూ స్పెషల్ రద్దు
  • విశాఖ - రాజమండ్రి(07467) మెమూ స్పెషల్ రద్దు
  • కోరాపుట్ - విశాఖ(08545) స్పెషల్ రద్దు
  • విశాఖ - కోరాపుట్(08546) స్పెషల్ రద్దు
  • పలాస - విశాఖ(08531) స్పెషల్ రద్దు
  • చెన్నై - పూరి (22860) ఎక్స్‌ప్రెస్‌ రద్దు
  • రాయగడ - గుంటూరు(17244) ఎక్స్‌ప్రెస్‌ రద్దు

07:05 October 30

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం, 14 మంది మృతి

  • విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం, 14 మంది మృతి
  • విజయనగరం: రైలు ప్రమాదంలో 100 మందికి పైగా గాయాలు
  • విశాఖ-రాయగడ ప్యాసింజర్‌లోని ఇద్దరు లోకో పైలట్లు మృతి
  • విజయనగరం: పలాస ప్యాసింజర్‌ గార్డు ఎం.ఎస్‌.రావు మృతి
  • విశాఖ, విజయనగరం ప్రభుత్వాస్పత్రులకు క్షతగాత్రుల తరలింపు
  • ఘటనాస్థలి నుంచి 11 మంది మృతదేహాలు తరలింపు
  • మరో మూడు మృతదేహాలు బోగీల్లో ఉన్నట్లు సమాచారం
  • విజయనగరం: కొత్తవలస మం. భీమాలి వద్ద ప్రమాద ఘటన
  • ఒడిశా బాలేశ్వర్‌ రైలు ప్రమాదం తరహాలో ఘటన
  • ఘటనాస్థలిని పరిశీలించిన మంత్రి ముత్యాలనాయుడు

07:05 October 30

సిగ్నల్‌ కోసం వేచి ఉన్న రైలును వెనుక నుంచి ఢీకొన్న మరో రైలు

  • విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం
  • సిగ్నల్‌ కోసం వేచి ఉన్న రైలును వెనుక నుంచి ఢీకొన్న మరో రైలు
  • పలాస ప్యాసింజర్‌ను వెనుక నుంచి ఢీకొన్న విశాఖ-రాయగడ ప్యాసింజర్‌
  • విజయనగరం: ప్రమాదానికి గురైన నాలుగు బోగీలు
  • పక్క ట్రాక్‌లో వస్తోన్న గూడ్సుపై ఎగిరిపడిన బోగీ
  • ఒడిశా బాలేశ్వర్‌ రైలు ప్రమాద ఘటన మాదిరిగా ప్రమాదం

06:41 October 30

ప్రమాదానికి గురైన బోగీలను తరలించే ప్రక్రియ చేపట్టిన సిబ్బంది

  • రైలు ప్రమాద స్థలంలో కొనసాగుతున్న సహాయ చర్యలు
  • ప్రమాదానికి గురైన బోగీలను తరలించే ప్రక్రియ చేపట్టిన సిబ్బంది
  • బోగీల తరలింపు, ట్రాక్‌ పునరుద్ధరణ వేగవంతం చేసిన సిబ్బంది
  • ప్రమాద ఘటనపై దర్యాప్తు చేపట్టిన అన్ని విభాగాల అధికారులు
  • రాత్రి 9 నుంచి నిరంతరం శ్రమిస్తున్న 7 సహాయక బృందాలు
  • ట్రాక్‌ పునరుద్ధరణ జరగకపోవడంతో ఆగిన రైళ్ల రాకపోకలు

06:23 October 30

రైలు ప్రమాదస్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు

  • రైలు ప్రమాదస్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు
  • నాలుగు గంటల్లో క్లియర్ చేస్తామని తెలిపిన సిబ్బంది
  • 7 బృందాలతో నిరవధికంగా కొనసాగుతున్న సహాయక పనులు

06:23 October 30

రైలు ప్రమాదం నేపథ్యంలో నేడు పలు రైళ్లు రద్దు

  • రైలు ప్రమాదం నేపథ్యంలో నేడు పలు రైళ్లు రద్దు
  • కోర్బా-విశాఖపట్నం, పారదీప్‌-విశాఖపట్నం రైళ్లు రద్దు
  • రాయగడ-విశాఖపట్నం, పలాస-విశాఖపట్నం రైళ్లు రద్దు
  • విశాఖపట్నం-గుణుపూర్‌, గుణుపూర్‌-విశాఖపట్నం రైళ్లు రద్దు
  • గుంటూరు- రాయగడ, గుంటూరు- విశాఖ రైళ్లు రద్దు
  • కాకినాడ పోర్టు-విశాఖ, విశాఖ-కాకినాడ పోర్టు రైళ్లు రద్దు
  • రాజమహేంద్రవరం-విశాఖ, విశాఖ-రాజమహేంద్రవరం రైళ్లు రద్దు
  • విజయవాడ-విశాఖ, విశాఖ-విజయవాడ రైళ్లు రద్దు

06:23 October 30

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం, 14 మంది మృతి

  • విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం, 14 మంది మృతి
  • ప్రమాదంలో 100 మందికి పైగా గాయాలు
  • క్షతగాత్రులను విశాఖ, విజయనగరం ఆస్పత్రులకు తరలింపు
  • విజయనగరం: కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం
  • ఒకే ట్రాక్‌పై ముందున్న రైలును వెనుక నుంచి ఢీకొన్న మరో రైలు
  • పలాస ప్యాసింజర్‌ వెనుక బోగీని ఢీకొన్న విశాఖ-రాయగడ ప్యాసింజర్‌
  • విశాఖ-రాయగడ ప్యాసింజర్‌ ఢీకొని పట్టాలపై పడిన పలాస ప్యాసింజర్‌ బోగీ
  • ఎదురుగా వస్తున్న గూడ్స్ ఇంజిన్‌ను ఢీకొన్న రాయగడ, పలాస ప్యాసింజర్లు
  • పక్క ట్రాక్‌లోని గూడ్సుపైకీ దూసుకెళ్లి మరింత బీభత్సం
  • ఒడిశా బాలేశ్వర్‌ రైలు ప్రమాద సంఘటన మాదిరిగానే ఈ ప్రమాదం

06:22 October 30

విజయనగరం: ఘటనాస్థలి నుంచి రైళ్లను తరలించిన అధికారులు

  • విజయనగరం: ఘటనాస్థలి నుంచి రైళ్లను తరలించిన అధికారులు
  • పలాస ప్యాసింజర్ 11 బోగీలు అలమండ స్టేషన్‌కు తరలింపు
  • రాయగడ ప్యాసింజర్‌ 9 బోగీలు కంటకాపల్లి స్టేషన్‌కు తరలింపు

06:22 October 30

ప్రమాదంపై హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసిన రైల్వే అధికారులు

  • ప్రమాదంపై హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసిన రైల్వే అధికారులు
  • హెల్ప్ లైన్లు: 0891 2746330, 0891 2744619
  • హెల్ప్ లైన్లు: 81060 53051, 8106053052, 8500041670, 8500041671
  • రైల్వే హెల్ప్ లైన్లు: 83003 83004, 85005 85006
  • భువనేశ్వర్‌ హెల్ప్ లైన్లు: 0674-2301625, 2301525, 2303069
  • వాల్తేరు హెల్ప్ లైన్ నంబర్‌: 0891- 2885914
  • అనకాపల్లి హెల్ప్ లైన్ నంబర్‌: 08924221698
  • గూడూరు హెల్ప్ లైన్ నంబర్‌: 9494178434
  • ఏలూరు హెల్ప్ లైన్ నంబర్‌: 0881-2232267
  • రాజమహేంద్రవరం హెల్ప్ లైన్ నంబర్‌: 08854-252172

06:22 October 30

రైలు ప్రమాదంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విచారం

  • రైలు ప్రమాదంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విచారం
  • సహాయ చర్యల్లో పాల్గొనాలని స్థానిక టీడీపీ శ్రేణులకు లోకేశ్ పిలుపు

06:22 October 30

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన రైల్వే శాఖ

  • మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన రైల్వే శాఖ
  • తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన రైల్వే శాఖ
  • స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం: రైల్వే శాఖ
  • మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ప్రధాని సాయం
  • క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన మోదీ

06:22 October 30

పలాస రైలులో వెనుక బోగీ ఆనుకుని ఉన్న గార్డు ఎంఎస్‌ రావు మృతి

  • పలాస రైలులో వెనుక బోగీ ఆనుకుని ఉన్న గార్డు ఎంఎస్‌ రావు మృతి
  • రాయగడ రైలు ఇంజిన్‌లో ఉన్న ఇద్దరు లోకో పైలెట్లు మృతి
  • శ్రీకాకుళం జిల్లా ఎస్వీఆర్‌ పురం వాసి గిరిజాల లక్ష్మి మృతి
  • విజయనగరం జిల్లా జామి మం. గొడుకోమ్ము వాసి రవి మృతి
  • విజయనగరం జిల్లా వాసి చల్లా సతీష్‌ మృతి
  • విజయనగరం జిల్లా గరివిడి వాసి పెనుమర్రి గౌరినాయుడు మృతి

06:21 October 30

రైలు ప్రమాద ఘటనపై గవర్నర్ అబ్దుల్ నజీర్‌ దిగ్భ్రాంతి

  • రైలు ప్రమాద ఘటనపై గవర్నర్ అబ్దుల్ నజీర్‌ దిగ్భ్రాంతి
  • మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన గవర్నర్‌ నజీర్‌

06:21 October 30

రైలు ప్రమాద ఘటన దిగ్భ్రాంతికరం: పవన్ కల్యాణ్‌

  • రైలు ప్రమాద ఘటన దిగ్భ్రాంతికరం: పవన్ కల్యాణ్‌
  • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరిన పవన్‌
  • మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి: పవన్‌

06:19 October 30

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం జగన్‌

  • LIVE UPDATES: మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం జగన్‌
  • తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం జగన్‌
  • ఇతర రాష్ట్రాలకు చెందిన మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం: సీఎం
  • ఇతర రాష్ట్రాలకు చెందిన క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారం: సీఎం
Last Updated : Oct 30, 2023, 4:26 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details