Vivek Agnihotri Y category security: బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి వై కేటగిరీ భద్రతను కల్పించింది కేంద్ర ప్రభుత్వం. వాస్తవ ఘటనల ఆధారంగా ఆయన తీసిన 'ద కశ్మీర్ ఫైల్స్' సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై, కొన్ని వర్గాల నుంచి ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో ఆయన ఎక్కడకు వెళ్లినా.. సీఆర్పీఎఫ్ జవాన్లు వెంటే ఉంటారు.
'ద కశ్మీర్ ఫైల్స్' దర్శకుడికి వీఐపీ సెక్యూరిటీ - ద కశ్మీర్ ఫైల్స్
Vivek Agnihotri Y category security: ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి కేంద్ర ప్రభుత్వం.. వై కేటగిరీ భద్రత కల్పించింది. ఈయన ఈ మధ్యే విడుదలైన 'ద కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని తెరకెక్కించారు.
వివేక్ అగ్నిహోత్రి
ద కశ్మీర్ ఫైల్స్.. 90వ దశకంలో కశ్మీర్ పండిట్లపై జరిగిన హత్యకాండ కథాంశంతో తెరకెక్కిన సినిమా. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. మార్చి 11న విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తోంది.
ఇదీ చదవండి:దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు.. ప్రజలకు మోదీ శుభాకాంక్షలు