తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యాచకుడి వద్ద రూ.65 వేల పాత నోట్లు.. అది తెలియదట!

తమిళనాడులోని ఓ వృద్ధుడి (Tamil nadu Krishnagiri news) వద్ద రూ.65 వేల విలువైన 500, 1000 నోట్లు బయటపడ్డాయి. నోట్ల రద్దు గురించి తెలియని వృద్ధుడు.. ఆ నోట్లను మార్చి ఇవ్వాలని అధికారులను వేడుకుంటున్నాడు. (Demonetisation in India)

65K demonetised notes
యాచకుడి వద్ద రూ.65 వేల పాత నోట్లు

By

Published : Oct 21, 2021, 12:36 PM IST

దేశంలో పెద్ద నోట్ల రద్దు (Demonetisation in India) జరిగి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ వాటి గురించి తెలియని వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తమిళనాడు కృష్ణగిరి(Tamil nadu Krishnagiri news) జిల్లాలో ఓ వృద్ధుడు.. ప్రభుత్వం డీమానిటైజేషన్ చేసిన విషయం తెలీక తన పాత నోట్లను మార్చి ఇవ్వాలని ఇప్పుడు అధికారులకు అర్జీ పెట్టుకున్నాడు.

పాత నోట్లు చూపిస్తున్న చిన్నకన్ను

పవక్కల్ పంచాయతీకి చెందిన చిన్నకన్ను అనే వృద్ధుడికి కంటిచూపు వైకల్యం ఉంది. గత కొన్నేళ్ల నుంచి యాచిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే సంపాదించిన డబ్బును దాచుకున్నాడు. నోట్ల రద్దుకు ముందు మొత్తం రూ.65 వేలను భద్రపరుచుకున్నాడు. ఇవన్నీ 500, 1000 నోట్ల (Old 500 rupee note) రూపంలోనే ఉన్నాయి.

పాత నోట్లు చూపిస్తున్న చిన్నకన్ను

అయితే, దాచుకున్న డబ్బుల విషయం వృద్ధుడు మర్చిపోయాడు. అనంతరం కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్​ 8న పెద్ద నోట్లను రద్దు చేసింది. ఈ విషయం చిన్నకన్నుకు తెలియలేదు. ఇటీవల అవి బయటపడగా.. తీసుకెళ్లి బ్యాంకు అధికారులకు ఇచ్చాడు. ఆ నోట్లు చెల్లవు అని చెప్పేసరికి అవాక్కయ్యాడు.

పాత వెయ్యి రూపాయల నోట్లు

దీంతో తనను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్​ను వేడుకున్నాడు చిన్నకన్ను. యాచించి కూడబెట్టిన డబ్బును.. ఇప్పుడు చెల్లదని అంటున్నారని తన గోడు చెప్పుకున్నాడు. నోట్లను రద్దు చేసిన విషయం తనకు తెలీదని అర్జీలో పేర్కొన్నాడు. ఎలాగైనా నగదును మార్చి ఇవ్వాలని కలెక్టర్​ను అభ్యర్థించాడు.

ప్రభుత్వ అధికారులకు విన్నపం

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details