Kerala high court virtual hearing: కరోనా మహమ్మారి కారణంగా కోర్టులు వర్చువల్గా విచారణ చేపడుతున్నాయి. విచారణకు చొక్క లేకుండా హాజరవటం, ఇతర వ్యక్తులతో కలిసి హాజరైన సంఘటనలు చూశాం. కానీ, కేరళ హైకోర్టులో గత మంగళవారం ఆన్లైన్ విచారణ సందర్భంగా ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఓ వ్యక్తి తన బాత్రూమ్లో షేవింగ్ చూసుకుంటున్న వీడియో ప్రత్యక్షమైంది.
ఈ సంఘటన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీజీ అరుణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టిన క్రమంలో జరిగింది. బాత్రూమ్లో ఉండగా వీడియో స్విచ్ఆన్ అయిందని తెలియకుండానే.. కోర్టు విచారణలో కనిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.