ఓపెన్ బుక్ పరీక్షల విధానంపై(open book examination) చాలా సంవత్సరాలుగా చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలు ప్రయోగాత్మకంగా చేపట్టాయి. ఈ క్రమంలోనే కర్ణాటక, బెళగావిలోని విశ్వేశ్వరయ్య సాంకేతిక విశ్వవిద్యాలయం(వీటీయూ).. ఈ విద్యా సంవత్సరంలోనే ఇంజినీరింగ్‌లోని పలు కోర్సుల్లో(open book exam) అమలు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. డిజైన్ ఆధారిత థీమ్‌కు సంబంధించిన కోర్సుల్లో ముందుగా అమలు చేసి.. ఆ తర్వాత సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఆర్కిటెక్చర్ వంటి కోర్సుల్లో ప్రవేశపెట్టాలని చూస్తోంది. నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు వీటీయూలోని ప్రత్యేక బోర్డు అధికారికంగా ఆదేశాలు జారీ చేయనుంది.
ఓపెన్ బుక్ విధానంపై(open book examin india) ఈటీవీ భారత్ ముఖాముఖిలో పలు విషయాలు వెల్లడించారు.. ఎకనామిక్స్, రిజిస్ట్రార్-ఎగ్జామినేషన్, మూల్యాంకనం విభాగాధిపతి డాక్టర్ సునీల్ కుమార్.
- ప్ర: ఓపెన్ బుక్ పరీక్ష విధానం అంటే ఎమిటి?
జవాబు: ఓపెన్ బుక్ పరీక్ష విధానంలో(open book exam 2021) విద్యార్థులు క్లాస్ నోట్స్, అధ్యాపకులు ఇచ్చిన మెటీరియల్, టెక్ట్స్ బుక్స్, ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చిన అధికారిక మెటీరియల్స్‌ను పరీక్షల్లో చూసే అవకాశం ఉంటుంది. పరీక్ష సమయంలో విద్యార్థులకు ప్రశ్నాపత్రంతో పాటు మెటీరియల్ అందిస్తారు. ఇది ఇంట్లో పరీక్ష రాసినట్లుగా ఉంటుంది.
- ప్ర: మన విద్యా వ్యవస్థకు ఈ విధానం ఎంత వరకు సరిపోతుంది?
జవాబు: ఓపెన్ బుక్ పరీక్ష విధానానికి(open book exam means) విద్యాబోధన ప్రస్తుత సంప్రదాయ పద్ధతిలో కాకుండా వేరుగా ఉండాలి. జవాబు పత్రాల మూల్యాంకనంలోనూ విభిన్నంగా, నిర్దిష్ట ప్రమాణాలు ఉండాలి. చాలా విద్యా సంస్థల్లో కేస్ స్టడీస్, వీడియోలు, కోర్సు మెటీరియల్‌తో తరగతి గదిలో బోధించడానికి అధ్యాపకులు వివిధ పద్ధతలను అవలంబిస్తారు. ఓపెన్ బుక్ విధానాన్ని అమలు చేయడానికి విభిన్న నైపుణ్యాలు కలిగి ఉండాలి.
- ప్ర: ఈ విధానం అమలు చేస్తే.. ఏ కోర్సు దానికి అనుగుణంగా ఉంటుంది?