తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చెన్నైవాసి అనారోగ్యానికి ఆక్స్​ఫర్డ్​ టీకా కారణం కాదు' - ఐసీఎంఆర్

కొవిషీల్డ్​ వ్యాక్సిన్​కు, చెన్నై వాసి అనారోగ్య సమస్యకు ఎలాంటి సంబంధం లేదని భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) నిర్వహించిన దర్యాప్తులో తేలింది. సీరం సంస్థ రూపొందించిన కొవిషీల్డ్​ వ్యాక్సిన్​ తీసుకోవడం వల్లే తనకు నాడీ సంబంధ సమస్యలు తలెత్తాయన్న చెన్నై వాసి ఆరోపణలపై విచారణ జరిపి ఈ నిర్ణయానికి వచ్చింది.

VIRUS-SERUM VACCINE DCGI
'వ్యాక్సిన్​కు, చెన్నైవాసి ఆరోగ్యానికి సంబంధం లేదు'

By

Published : Dec 2, 2020, 10:44 PM IST

కొవిషీల్డ్​ వ్యాక్సిన్​ వల్ల చెన్నైవాసికి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) వెల్లడించింది. దర్యాప్తులో భాగంగా నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు డీసీజీఐ ఈ నిర్ణయానికి వచ్చింది. వలంటిర్​కు నష్టపరిహారం ఇవ్వొద్దని తెలిపింది. మరోవైపు తమ వ్యాక్సిన్​ సురక్షితమైనది, శక్తివంతమైనదని సీరం సంస్థ స్పష్టం చేసింది. ఈ ఘటన వల్ల వ్యాక్సిన్​ షెడ్యూల్​లో మార్పు ఉండదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. డ్రగ్స్, వ్యాక్సిన్లు​ తయారు చేసేటప్పుడు ఇలాంటి ఘటనలు జరగటం సహజమని ఐసీఎంఆర్​ డైరెక్టర్ జనరల్ డా.బలరామ్​ భార్గవ అభిప్రాయపడ్డారు. దీని వల్ల వ్యాక్సిన్​ ప్రయోగాలు ఆగవని స్పష్టం చేశారు.

చెన్నైకి చెందిన 40ఏళ్ల వ్యక్తికి ట్రయల్స్​లో భాగంగా కొవిషీల్డ్​ టీకా ఇచ్చారు. అనంతరం తనకు నాడీ సంబంధిత సమస్యలు తలెత్తినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సీరం సంస్థపై రూ.5కోట్ల దావా సైతం వేశారు.

ABOUT THE AUTHOR

...view details