తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Viral Video : వారెవ్వా.. ఏం టాలెంట్​రా బుడ్డోడా..! నెట్టింట వీడియో వైరల్..! - టాలెంట్​తో ఫిదా చేస్తున్న స్మార్ట్ కిడ్ వీడియో

Viral Video : సోషల్ మీడియాలో తరచూ చిన్న పిల్లల వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అలాంటి మరో వీడియోనే ఒకటి నెట్టింట తెగ వైరల్​ అవుతోంది. అందులో బుడతడి టాలెంట్ చూసి నెటిజన్లు తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆలస్యమెందుకు..? మీరు ఆ వీడియోపై లుక్కేయండి.!

Kid
Wonder Kid

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 5:33 PM IST

Wonder Kid Video Viral :నేటి బిజీబిజీ కాలంలో రోజంతా పనిచేస్తూ.. చాలామంది బోలెడంత ఒత్తిడికి గురవుతున్నారు. అలాంటపుడు.. ఏదైనా సరదా వీడియో చూస్తే మనస్సుకు కాస్త ఉపశమనం దొరుకుతుంది. ఇక అదే చిన్న పిల్లల డ్యాన్స్ వీడియోలు, వారు ఆడుకునే వీడియోలు చూస్తే.. ఎంతటి ఒత్తిడి అయినా ఇట్టే దూరమవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి వీడియోనే ఒకటి తెగ వైరల్ అవుతుంది. అందులో ఒక బుడతడి టాలెంట్​ చూసి నెటిజన్లు వారెవ్వా ఏం టాలెంట్​ రా బాబు! అని తెగ పొగిడేస్తున్నారు.

Genius Toddler Viral Video : ప్రతిభ అనేది ఎవరి సొత్తూ కాదు. టాలెంట్​కి వయసుతో పని లేదు. ఎంత చిన్న పిల్లలైనా లేదా పెద్ద వారైనా సంచలనాలు సృష్టిస్తుంటారు. ఈ వీడియోలోని చిన్నోడూ కూడా తనదైన టాలెంట్​తో అల్లాడిస్తున్నడు. ఈ బుడతడి టాలెంట్ చూసిన నెటిజన్లు.. "బేబీ ఐన్​స్టీన్" అని పిలుస్తున్నారు.

Baby Einstein Video Viral on Twitter :ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను ఫిగెన్ అనే టర్కిష్ ఉమెన్ తన @TheFigen_ అనే ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోకు 'Einstein Baby' అనే క్యాప్షన్ జోడించింది. సోషల్ మీడియాలో వైరల్​అవుతున్న ఈ వీడియోలో.. ఆ బుడతడు వేర్వేరు స్లాట్లలో ఉంచిన వివిధ రంగులలో ఉన్న వృత్తాకార బంతులను.. విజయవంతంగా ఒకే రంగు వాటిని ఒకే దగ్గరకు చేర్చి పజిల్ పూర్తి చేశాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈజీగా ఆ చిన్నోడు ఈ పజిల్ క్లియర్ చేశాడు. దీంతో ఆ చిన్నారి టాలెంట్​కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

ఈ చిన్నోడు ఎంత 'ముద్దు'గా సారీ చెప్పాడో.. నెట్టింట వీడియో వైరల్​

సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రెండ్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు 5.6 M(మిలియన్స్) మందికి పైగా వీక్షించారు. అలాగే దీనిని 127.2K మందికి పైగా లైక్ చేశారు. ఆ బుడతడి ట్యాలెంట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వాటిలో కొన్ని కామెంట్లు చూస్తే.. 'స్మార్ట్​ కిడ్!', మైండ్ గేమ్ సో స్ట్రాంగ్, 'game so strong', 'స్మార్ట్ బేబీ 🥺', 'సో క్యూట్ ❤️ 'అద్భుతం 'నిజంగా చాలా తెలివైనవాడు', 'బ్రిలియంట్ బేబీ 👶 😘', 'అద్భుతం', 'వావ్ బేబీ 🙌🏻❤️', 'అవును! 👏 చాలా స్మార్ట్!!', 'నమ్మలేకపోయాను😷ఇప్పుడు కూడా నేను చేయలేను' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Viral: ఈ బుడతడు.. డ్యాన్స్​తో అదరగొట్టాడు

మీరాబాయిని అనుకరించిన చిన్నారి.. వీడియో వైరల్

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన చిన్నారి​.. వీడియో వైరల్​!

ABOUT THE AUTHOR

...view details