తెలంగాణ

telangana

ETV Bharat / bharat

covid vaccine: టీకా వద్దన్న ప్రజలు- రంగంలోకి పోలీసులు

ఓవైపు టీకా(covid vaccine) దొరకట్లేదని కొంతమంది వాపోతుండగా.. మరికొంత మంది మాత్రం 'మాకు టీకా వద్దంటే వద్ద'ని అంటున్నారు. వ్యాక్సిన్​పై(covid vaccine) నెలకొన్న అపోహలే ఇందుకు కారణం. ఉత్తర్​ప్రదేశ్​ కాస్​గంజ్​ జిల్లాలో టీకా తీసుకోవడానికి స్థానికులు వెనుకడుగు వేయగా.. పోలీసులు రంగంలోకి దిగి వారిని వ్యాక్సిన్​ వేయించుకునేందుకు తీసుకురావాల్సి వచ్చింది.

By

Published : May 28, 2021, 12:17 PM IST

vaccine fears
టీకాపై ప్రజలు అనవసరపు భయాందోళనలు

టీకా(covid vaccine) తీసుకోకుండా పారిపోతున్న వారిని పట్టుకుంటున్నపోలీసులు

కరోనా మహమ్మారిని ఎదుర్కోవటానికి వ్యాక్సిన్(covid vaccine)​ తీసుకోవాలని ప్రభుత్వం ఎంతలా ప్రచారం చేస్తున్నా.. కొందరిలో టీకాపై ఉన్న అపోహలు ఇంకా వీడటం లేదు. వ్యాక్సిన్(covid vaccine)​ తీసుకుంటే తమకు ప్రాణహాని తలెత్తుతుందని భయపడుతున్నారు. తాజాగా.. ఇలాంటి ఘటనే ఉత్తర్​ప్రదేశ్​ కాస్​గంజ్​లో వెలుగు చూసింది. ప్రజలు టీకా తీసుకునేందుకు విముఖత చూపగా.. పోలీసులు రంగంలోకి దిగి వారిని తీసుకురావాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

అసలేమైందంటే..?

పటియాలీ తహసీల్దార్​ రాజీవ్​ నిగమ్​ నేతృత్వంలోని అధికారుల బృందం.. కాస్​గంజ్​ వీధుల్లో గురువారం మధ్యాహ్నం అడుగుపెట్టింది. ఆ బృందం 45 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తిని ఆపి కొవిడ్​ టీకా(covid vaccine) తీసుకోవాలని కోరింది. అయితే.. అందుకు నిరాసక్తి చూపించిన అతడు పారిపోవాలని యత్నించాడు. దాంతో అతణ్ని పట్టుకుని తమ వాహనంలో ఏర్పాటు చేసిన వైద్య కేంద్రం వద్దకు తీసుకువచ్చింది. అదే సమయంలో మరికొంతమంది కూడా పోలీసులను, అధికారులను చూసి పరారయ్యారు.

పోలీసులు వస్తున్నారని తెలిసి.. పారిపోతున్న వ్యక్తి
ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన వ్యక్తి

కాస్​గంజ్​ జిల్లాలో వివిధ గ్రామాల్లోని ప్రజలు కరోనా టీకాపై గందరగోళానికి గురవుతున్నారు. ప్రజలకు ఉన్న అపోహలను పోగొట్టేంగురు జిల్లా మేజిస్ట్రేట్.. ఓ​ పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. అంతేగాకుండా.. జిల్లా డిప్యూటీ మేజిస్ట్రేట్లు, బ్లాక్​ డెవలప్​మెంట్​ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే.. ఇన్ని చర్యలు చేపట్టినా టీకాపై ప్రజలు అపోహలను వీడటం లేదనే ఉదంతాలు బయటపడతున్నాయి.

ఇదీ చూడండి:వైరల్​: బతికున్న పామును తింటే.. కరోనా రాదంట!

ఇదీ చూడండి:కరోనా వైరస్ ప్రొటీన్​ కీలక గుట్టు కనుగొన్న శాస్త్రవేత్తలు

ABOUT THE AUTHOR

...view details