తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్లాసులకు రావడం లేదని.. విద్యార్థిపై టీచర్​ పైశాచికం - chidambaram news

క్లాసులకు సరిగా రావడం లేదని విద్యార్థిని కింద పడేసి, జుట్టు పట్టుకుని తీవ్రంగా కొట్టాడు ఓ టీచర్​. ఈ ఘటన తమిళనాడు చిదంబరంలో జరిగింది.

Viral video: Teacher beats and kicks school students brutally inside classroom
దారుణం

By

Published : Oct 14, 2021, 5:55 PM IST

Updated : Oct 14, 2021, 8:13 PM IST

క్లాసులకు రావడం లేదని..

తమిళనాడులోని చిదంబరంలో ఓ ఉపాధ్యాయుడు తన విద్యార్థి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. క్లాసులకు సరిగా రావడం లేదని విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అతన్ని కింద పడేసి జుట్టు పట్టుకుని తీవ్రంగా కొడుతూ.. కాళ్లతో తంతూ హింసించాడు. అదే తరగతిలో ఉన్న మరో విద్యార్థి వీడియో తీయడం వల్ల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలకు చెందిన సదరు విద్యార్థి క్లాసులకు సరిగా రావడం లేదనే సాకుతో ఆ టీచర్ కొట్టినట్లు సమాచారం.

ఈ హింసాత్మక ఘటనపై ఎంపీ కార్తీ చిదంబరం స్పందించారు. ఇలా కొట్టి హింసించడం సబబు కాదని.. ఆ టీచర్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.

ఘటనకు సంబంధించి టీచర్​పై దర్యాప్తునకు ఆదేశించినట్టు.. కడలూర్​ జిల్లాకలెక్టర్​ బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు.

ఇదీ చూడండి:-15ఏళ్ల స్టూడెంట్​తో రిలేషన్​- గర్భవతి అయిన టీచర్ అరెస్ట్

Last Updated : Oct 14, 2021, 8:13 PM IST

ABOUT THE AUTHOR

...view details